LPG PRICE : కొత్తనెల.. గుదిబండగా మారిన గ్యాస్ సిలిండర్ రేటు

by I. Sairam |   (  Updated:2026-02-11 08:27:46  IST  )

ప్రతినెలా 1వ తేదీన చమురు సంస్థలు గ్యాస్ సిలిండర్ల ధరలను సవరిస్తాయి. ఈ క్రమంలో సిలిండర్ ధరల్లో హెచ్చుతగ్గులు నమోదవుతుంటాయి.

LPG PRICE : కొత్తనెల.. గుదిబండగా మారిన గ్యాస్ సిలిండర్ రేటు
X

దిశ, వెబ్ డెస్క్: నిత్యావసర వస్తువుల్లో ఒకటైన గ్యాస్ సిలిండర్ ధరలు అంతర్జాతీయ ముడి చమురు ధరలపై ఆధారపడి ఉంటాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగానికి మరికొన్ని గంటల సమయం ఉందనగా, సామాన్యుడిపై ధరల భారం పడింది. ప్రతి నెలా ఒకటో తేదీన ధరలను సవరించే ప్రభుత్వ రంగ చమురు సంస్థలు.. ఫిబ్రవరి 1న ఎల్‌పీజీ (LPG) వినియోగదారులకు షాక్ ఇచ్చాయి. కమర్షియల్ సిలిండర్ ధరను భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి.

తాజా సవరణ ప్రకారం.. 19 కేజీల వాణిజ్య (Commercial) సిలిండర్ ధరపై రూ.50 పెరిగింది. ఈ పెంపుతో దేశ రాజధాని ఢిల్లీలో 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధర రూ. 1740.50 కి చేరుకుంది. అయితే గృహ వినియోగ (Domestic) ఎల్పీజీ సిలిండర్ల ధరల్లో మాత్రం ఆయిల్ కంపెనీలు ఎటువంటి మార్పు చేయలేదు. కాగా బడ్జెట్ వేళ వాణిజ్య సిలిండర్ ధరలు పెరగడం హోటళ్లు, రెస్టారెంట్ల నిర్వాహకులపై అదనపు భారం పడిందనే చెప్పవచ్చు. మారిన ధరల ప్రకారం తెలుగురాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో గ్యాస్ సిలిండర్ ధరలు ఇలా ఉన్నాయి.

హైదారాబాద్: రూ.905

వరంగల్: రూ.924

విశాఖపట్నం: రూ.861

విజయవాడ: రూ.875

గుంటూరు: రూ. 877

Next Story