- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
LOVERS DAY: లవర్స్ డే ఎఫెక్ట్.. దేశంలో భారీగా బుక్ అవుతున్న రూమ్స్
ఫిబ్రవరి 14న లవర్స్ డే రాబోతుంది. దీంతో సెలబ్రేట్ చేసుకునేందుకు ప్రేమికులు సిద్ధం అవుతున్నారు. ఇప్పటికే చాలా మంది ప్లాన్స్ రెడీ చేసుకోగా మరికొందరు ఎక్కుడికి వెళ్లాలి అనే ఆలోచనలో ఉన్నారు.

దిశ, వెబ్ డెస్క్: ఫిబ్రవరి 14న లవర్స్ డే రాబోతుంది. దీంతో సెలబ్రేట్ చేసుకునేందుకు ప్రేమికులు సిద్ధం అవుతున్నారు. ఇప్పటికే చాలా మంది ప్లాన్స్ రెడీ చేసుకోగా మరికొందరు ఎక్కుడికి వెళ్లాలి అనే ఆలోచనలో ఉన్నారు. అయితే మరో 6 రోజులు సమయం ఉండగానే బుకింగ్స్ భారీగా పెరిగిపోయాయని హోటల్ బుకింగ్స్ యాప్స్ గణాంకాలు చెబుతున్నాయి. ఈ ఏడాది ప్రేమికుల దినోత్సవానికి ముందే దేశంలో హోటల్స్ బుకింగ్ భారీగా పెరిగినట్టు బుకింగ్ ప్లాట్ ఫామ్ "క్లియర్ ట్రిప్" చీఫ్ గ్రోత్, బిజినెస్ ఆఫీసర్ మంజరి సింఘాల్ తెలిపారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది బుకింగ్స్ 175శాతం పెరిగాయని చెప్పారు. ఇది విహారయాత్రలపై చూపుతున్న ఆసక్తిని తెలియజేస్తుందన్నారు.
ఈ సందర్భంగా టూరిస్టు ప్రదేశాలకు ప్రయాణాలు కూడా పెరిగాయని చెప్పారు. గౌహతికి 60శాతం, కొలంబోకు 64శాతం ప్రయాణాలు బుకింగ్ చేసుకున్నట్టు చెప్పారు. వాలెంటైన్స్ డే సందర్భంగా ప్రతి ఏడాది బుకింగ్స్ లో పెరుగుదల స్పష్టంగా కనిపిస్తుందన్నారు. తమ రిసార్ట్స్ పోర్ట్ ఫోలియోలో బుకింగ్స్ 58 శాతం నుండి 110 శాతం వరకు పెరుగుతున్నాయని చెప్పారు. అంతే కాకుండా లవర్స్ డే రోజు ఒక్కరోజు మాత్రమే గడపకుండా రెండు మూడు రోజులు సెలబ్రేట్ చేసుకుంటున్నారని అన్నారు. ఎక్కువ రోజులు ఎంజాయ్ చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నారని, డబ్బులు కూడా ఎక్కువే ఖర్చు చేస్తున్నారని చెప్పారు. జిమ్ కార్పెట్, గోవా మరియు ముక్తేశ్వర్ లాంటి టూరిస్ట్ ప్రదేశాల్లో బుకింగ్స్ 70 నుండి 80 శాతం పెరిగిందన్నారు.






