నకిలీ రీఫండ్ స్కామ్‌‌తో రూ.కోట్లలో నష్టం.. కోర్టులో దావా వేసిన అమెజాన్

by Kema Shiva Kumar |

నకిలీ రీఫండ్ మోసంతో అమెజాన్‌కు మిలియన్ డాలర్ల నష్టం వాటిల్లింది. దీంతో ఆ సంస్థ న్యాయపోరాటానికి దిగింది.

నకిలీ రీఫండ్ స్కామ్‌‌తో రూ.కోట్లలో నష్టం.. కోర్టులో దావా వేసిన అమెజాన్
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ (Amazon) భారీ రీఫండ్ మోసానికి వ్యతిరేకంగా న్యాయపోరాటం చేయాలని డిసైడ్ అయింది. ఖరీదైన లాప్‌టాప్‌లు, గ్రాఫిక్ కార్డ్స్ (GPUs) కొనుగోలు చేసి, వాటికి నకిలీ రీఫండ్లు పొందుతున్న ఓ ముఠాపై అమెజాన్ కోర్టులో దావా వేసింది. ఈ స్కామ్ కారణంగా కంపెనీ మిలియన్ల డాలర్లు నష్టపోయినట్లుగా వెల్లడించింది.

అసలే ఏం జరిగిందంటే..?

కొందరు మోసగాళ్లు అమెజాన్‌లో ఖరీదైన ఎలక్ట్రానిక్ వస్తువులను ఆర్డర్ చేసి, అవి అందిన తర్వాత బాక్స్ ఖాళీగా ఉందని, వస్తువు పాడైపోయిందని చెప్పి నకిలీ క్లెయిమ్స్ ద్వారా డబ్బులు వెనక్కి తీసుకున్నారు. ఈ తరహా రీఫండ్ స్కామ్‌ల వల్ల అమెజాన్ సుమారు మిలియన్ల డాలర్లను నష్టపోయింది. ఈ మోసాన్ని కనిపెట్టడానికి, దర్యాప్తు చేయడానికి అమెజాన్ ఇప్పటికే 75,000 డాలర్లు అంటే భారత కరెన్సీలో సుమారు రూ.62 లక్షలు కంటే ఎక్కువ ఖర్చు చేసినట్లు కోర్టుకు తెలిపింది. ఈ మేరకు దర్యాప్తు కోసం తాము వెచ్చించిన ఈ మొత్తాన్ని తమకు తిరిగి చెల్లించాలని (Legal & Investigation costs) అమెజాన్ కోర్టును కోరింది. ఇలాంటి మోసపూరిత క్లెయిమ్‌లను అరికట్టేందుకు సెక్యూరిటీ అల్గారిథమ్స్‌ను మరింత పటిష్టం చేస్తున్నట్లుగా అమెజాన్ ప్రతినిధులు తెలిపారు.

Next Story