ఆహార పదార్థాల ప్రకటనలకు సంబంధించి ఎఫ్ఎస్ఎస్ఏఐ కీలక ఆదేశాలు!

by Disha Web Desk 17 |
ఆహార పదార్థాల ప్రకటనలకు సంబంధించి ఎఫ్ఎస్ఎస్ఏఐ కీలక ఆదేశాలు!
X

న్యూఢిల్లీ: దేశీయ ఆహార పదార్థాల తయారీ బ్రాండ్లకు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎఫ్ఎస్ఎస్ఏఐ) కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కొత్త నిబంధనలు డిసెంబర్ 13 నుంచి అమల్లోకి వస్తాయి. వివిధ ఆహార పదార్థాల ప్రకటనలకు సంబంధించి బ్రాండ్ పేర్లతో పాటు లేబుళ్లలో ఫ్రెష్, నేచురల్, జెన్యూన్, ప్యూర్, ఒరిజినల్, ట్రెడిషనల్, అథెంటిక్, ప్యూర్ లాంటి పేర్లను తక్కువగా వాడాలని తెలిపింది. ఈ పదాల వల్ల వినియోగదారులను తప్పుదోవ పట్టించే అవకాశాలు ఉన్న కారణంగా తాజా నిర్ణయం తీసుకున్నామని ఎఫ్ఎస్ఎస్ఏఐ పేర్కొంది.

కంపెనీలు ఆహార పదార్థాల ప్యాక్‌లపై విశేషణాలు వాడే సమయంలో తప్పనిసరిగా 'ఇది ట్రేడ్‌మార్క్, బ్రాండ్ పేరును మాత్రమే సూచిస్తుంది, ఆహార పదార్థ స్వభావాన్ని సూచిందని ' అనేలా డిస్‌క్లెయిమర్ ఉంచాలని స్పష్టం చేసింది. ఈ డిస్‌క్లెయిమర్ స్పష్టంగా కనిపించేంత పెద్దవిగా ఉండాలి. సదరు కంపెనీలను జవాబుదారీగా మార్చడంతో పాటు వినియోగదారుల ప్రయోజనాలను రక్షించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని ఎఫ్ఎస్ఎస్ఏఐ వివరించింది.

అంతేకాకుండా, ఆయా ఆహార పదార్థాల్లో పోషక విలువలకు సంబంధించిన నిబంధనలను కూడా ఎఫ్ఎస్ఎస్ఏఐ తీసుకొచ్చింది. ప్యాక్ చేసిన పదార్థాలు 100 గ్రాములు లేదా 100 ఎంఎల్‌కు ఎన్ని కేలరీలు, శక్తి లభిస్తుందో సూచించే విషయాలు ఉండాలి. దీనికి సంబంధించి మార్పులు, ఇతర అంశాల గురించి నెలరోజుల్లోగా ఆహార పదార్థాల తయారీ కంపెనీలు పంపవచ్చని పేర్కొంది.

Next Story

Most Viewed