- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
LIC Premium: ఎల్ఐసీ పాలసీదారులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. ఇక నుంచి వాట్సాప్ లోనే ప్రీమియం చెల్లింపు..!!
LIC Premium: ఎల్ఐసీ పాలసీదారులకు అదిరిపోయే గుడ్ న్యూస్. పాలసీ ప్రీమియం చెల్లించేందుకు ఇక నుంచి ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు.

దిశ, వెబ్ డెస్క్: LIC Premium: ఎల్ఐసీ పాలసీదారులకు అదిరిపోయే గుడ్ న్యూస్. పాలసీ ప్రీమియం చెల్లించేందుకు ఇక నుంచి ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎల్ఐసీ సరికొత్త సదుపాయాన్ని తీసుకువచ్చింది. అదే వాట్సాప్ ద్వారా ప్రీమియం చెల్లించే ఫెసిలిటీ. 2025 మే 9 నుంచి ఎల్ఐసీ పాలసీదారులు తమ అధికారిక వాట్సాప్ బాట్ ద్వారా ప్రీమియం డీటైల్స్ చూసుకోవడమే కాకుండా క్షణాల్లో పేమెంట్స్ కూడా పూర్తి చేయవచ్చు. ఈ కొత్త విధానం మొబైల్ వాడేవారికి సౌకర్యవంతంగా ఉంటుంది.
వాట్సాప్ ద్వారా ప్రీమియం ఎలా చెల్లించాలంటే ఎల్ఐసీ కస్టమర్ పోర్టల్ లో ఇప్పటికే రిజిస్టర్ చేసుకున్నవాళ్లు అయితే 8976862090 అనే వాట్సాప్ నంబర్‌కు 'HI' అని మెసేజ్ చేయాలి. తర్వాత ఒక బాట్ మెనూ సెండ్ చేస్తుంది. అందులో తగిన ఆప్షన్స్ సెలక్ట్ చేసుకోవాలి. కట్టాల్సిన ఎల్ఐసీ పాలసీల వివరాలన్నీ కూడా అందులో కనిపిస్తాయి. యూపీఐ, నెట్ బ్యాంకింగ్ లేదా డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా అన్నీ వాట్సాప్ లోనే బయటకు వెళ్లకుండానే పేమెంట్ పూర్తి చేసుకోవచ్చు. డబ్బులు కట్టిన వెంటనే రసీదు కూడా వస్తుంది. పాలసీ వెతకడం దగ్గర నుంచి డబ్బులు కట్టి రసీదు తీసుకునే వరకు ఈ ప్రక్రియ మొత్తం చాట్లోనే పూర్తి అవుతుంది.
ఎల్ఐసీ వెబ్ సైట్లో పాలసీలను రిజిస్టర్ చేసుకున్న కస్టమర్లు మాత్రమే ఈ వాట్సాప్ బాట్ ను యాక్సెస్ చేస్తారు. ముందుగా 8976862090 నెంబర్ ఫోన్ లో సేవ్ చేసుకుని HI అని మెసేజ్ చేయాలి. అప్పుడు చాట్ బాట్ అందుబాటులో ఉన్న సర్వీస్ జాబితాను చూపిస్తుంది. ప్రీమియం పేమెంట్స్ లేదా ఇతర పాలసీ సర్వీసుల కోసం సంబంధిత ఆప్షన్ నెంబర్ ను ఎంచుకుంటే చాలు. ముందుగా www.licindia.in వెబ్‌సైట్‌కి వెళ్లి అక్కడ కస్టమర్ పోర్టల్ పై క్లిక్ చేయండి. కొత్త యూజర్ అయితే న్యూ యూజర్ ఆప్షన్ ఎంచుకుని వివరాలన్నింటినీ నింపాలి. దీనికోసం పాలసీ నెంబర్లు ప్రీమియం అమౌంట్, పాన్ కార్డ్ లేదా పాస్ పోర్ట్ స్కాన్ చేసి కాపీ అవసరం అవుతాయి.
యూజర్ ఐడీ, పాస్ వర్డ్ క్రియేట్ చేసుకున్న తర్వాత లాగిన్ అయి బేసిక్ సర్వీసెస్ ట్యాప్ కింద ఉన్న యాడ్ పాలసీ పై క్లిక్ చేస్తే అన్ని పాలసీలను ఆన్ లైన్ లోనే చేసుకుని మెసేజ్ చేసుకోవచ్చు. బేసిక్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయ్యాక యూజర్లు ప్రీమియర్ సర్వీసెస్ కు అప్ గ్రేడ్ కావచ్చు. దీనికోసం మూడు సింపుల్ స్టెప్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. రిజిస్టర్ చేసుకున్న వివరాలతో ఆటోమెటిక్ గ్గా ఫిల్ అయ్యే ఒక ఫామ్ ను పూరించాలి. పాన్ లేదా పాస్ పోర్ట్ వివరాలను జత చేయాల్సి ఉంటుంది. ఆ ఫామ్ ప్రింట్ తీసుకుని సంతకం చేసి దాన్ని స్కాన్ చేసి కేవైసీ డాక్యెమెంట్ తో పాటు అప్ లోడ్ చేయాలి. జేపీజీ, పీఎన్జీ, బీఎంపీ, TIFF, GIF ఫార్మాట్స్‌లో ఫైల్స్ అప్ లోడ్ చేసుకోవచ్చు. అప్ లోడ్ చేశాక, రిక్వెస్ట్ ను సబ్మిట్ కొట్టాలి. ఎల్ఐసీ డాక్యుమెంట్లను మూడు పనిదినాల్లో వెరిఫై చేస్తుంది. సర్వీస్ యాక్టివేట్ అయినట్లు ఎస్ఎంఎస్ ఈ మెయిల్ ద్వారా వస్తుంది.






