- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
LIC Housing Finance: వడ్డీ రేట్లు తగ్గించిన ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్
సవరించిన వడ్డీ రేట్లు సోమవారం(డిసెంబర్ 22) నుంచే అమలులోకి వస్తాయి

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ గృహ రుణాల సంస్థ ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ వడ్డీ రేట్లను తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. కొత్త ఇళ్ల రుణాలపై వడ్డీ రేటును 7.15 శాతానికి తగ్గించినట్లు సోమవారం అధికారిక ప్రకటనలో తెలిపింది. సవరించిన వడ్డీ రేట్లు సోమవారం(డిసెంబర్ 22) నుంచే అమలులోకి వస్తాయి. చాలామంది ఇంటి నిర్మాణానికి సంబంధించి ఎక్కువ జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటారు. వారి సందేహాలను తీరుస్తూ, సొంత ఇంటి కలను నిజం చేసుకునేందుకు, వారి సెంటిమెంట్‌కి ఈ నిర్ణయం సహాయపడుతుందని కంపెనీ అభిప్రాయపడింది. ఇది ఇంటి నిర్మాణాన్ని మరింత సరసమైనదిగా మార్చడంలో ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ నిబద్దతను బలోపేతం చేస్తుందని అధికారిక ప్రకటనలో పేర్కొంది. కాగా, ఈ నెల ప్రారంభంలో భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) కీలక రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన నేపథ్యంలో బ్యాంకులు, ఆర్థిక సంస్థలు అందుకనుగుణంగా వడ్డీ రేట్లను సవరిస్తున్నాయి. ఇప్పటికే పలు బ్యాంకులు వడ్డీ రేట్లలో కోతను ప్రకటించగా, ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ కూడా రుణగ్రహీతలకు ఉపశమనం కల్పించింది.






