LIC: విద్యార్థుల కోసం 'గోల్డెన్ జూబ్లీ స్కాలర్‌షిప్ పథకం' ప్రారంభించిన ఎల్ఐసీ

by S Gopi |
LIC: విద్యార్థుల కోసం గోల్డెన్ జూబ్లీ స్కాలర్‌షిప్ పథకం ప్రారంభించిన ఎల్ఐసీ
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎల్ఐసీ) ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థుల కోసం ప్రత్యేకంగా కొత్త స్కాలర్‌షిప్ స్కీమ్‌ను ప్రారంభించింది. 'గోల్డెన్‌జూబ్లీ స్కాలర్‌షిప్ స్కీమ్-2024' పేరుతో తీసుకొచ్చిన ఈ పథకం ద్వారా ప్రతిభ ఉన్న విద్యార్థులకు నగదు ప్రోత్సాహం అందించనున్నట్టు ఎల్ఐసీ అధికారిక ప్రకటనలో పేర్కోంది. ఆదివారం నుంచి ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకునేందుకు అందుబాటులో ఉంటుందని ఎల్ఐసీ ఎక్స్‌లో ట్వీట్ చేసింది. ఈ స్కాలర్‌షిప్ పథకం కోసం 2021-22, 2022-23, 2023 -24 అకడమిక్ సంవత్సరాల్లో పదో తరగతి, ఇంటర్మీడియట్, డిప్లొమో లేదా తత్సమాన విద్యను పూర్తి చేసుకున్నవారు అర్హులు. కనీసం 60 శాతం మార్కులు లేదా సమానమైన సీజీపీఏ గ్రేడ్‌ కలిగి ఉండాలి. 2024-25లో ఉన్నత విద్య చదవాలని భావించే విద్యార్థులకు జనరల్‌ స్కాలర్‌షిప్‌లు లభిస్తాయి. మెడిసిన్‌, ఇంజినీరింగ్‌, గ్రాడ్యుయేషన్‌, ఏదైనా విభాగంలో డిప్లొమో, గుర్తింపు పొందిన విద్యాసంస్థల్లో వొకేషన్‌ కోర్సులులతో పాటు ఐటీఐ చదవాలనే వారికి స్కాలర్‌షిప్ భరోసా ఇవ్వనుంది.

Advertisement

Next Story

Most Viewed