- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Air india: విమాన ప్రమాద బాధితుల కోసం క్లెయిమ్ ప్రక్రియ సులభతరం చేసిన బీమా సంస్థలు
కష్టంలో కుటుంబాలకు డాక్యుమెంటేషన్ అవసరాలను సులభతరం చేయనున్నట్టు తెలిపింది.

దిశ, బిజినెస్ బ్యూరో: 241 మంది ప్రాణాలను బలిగొన్న విషాదకరమైన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదానికి సంబంధించి బాధితుల కుటుంబాలకు సహాయంగా బీమా సంస్థలు తమ వంతు సాయం అందించేందుకు ముందుకొచ్చాయి. ప్రభుత్వ రంగ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) శుక్రవారం తన క్లెయిమ్ సెటిల్మెంట్ ప్రక్రియలో సడలింపులను ప్రకటించింది. దీని ద్వారా బాధితులకు చెల్లింపులను వేగవంతం చేయడంతో పాటు కష్టంలో కుటుంబాలకు డాక్యుమెంటేషన్ అవసరాలను సులభతరం చేయనున్నట్టు తెలిపింది. ప్రమాదంలో తమ వారిని కోల్పోయిన వారికి భరోసా, ఆర్థిక మద్దతు ఇచ్చే లక్ష్యంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది. ఇందులో భాగంగా మరణించిన వారి డెత్ సర్టిఫికేట్ డాక్యుమెంట్లకు బదులుగా, విమాన ప్రమాదంలో మరణించినట్టు ప్రభుత్వం రికార్డులకు సంబంధించిన ఏదైనా ఆధారాన్ని సమర్పించవచ్చు. లేదా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలైనా, విమానయాన సంస్థలు చెల్లించినట్టు పరిహారానికి సంబంధించిన రుజువులను అందించవచ్చని ఎల్ఐసీ వెల్లడించింది. క్లెయిమ్‌లను వీలైనంత త్వరగా ప్రాసెస్ చేసేందుకు సాధ్యమైనన్ని అన్ని చర్యలు చేపడుతున్నట్టు స్పష్టం చేసింది.
ఎల్ఐసీ బాటలోనే ప్రైవేట్ రంగ బీమా కంపెనీ బజాజ్ అలియాంజ్ లైఫ్ ఇన్సూరెన్స్ కూడా క్లెయిమ్ ప్రక్రియను సులభతరం చేసే చర్యలను ప్రకటించింది. ప్రమాదంలో మరణించిన, గాయపడిన వారి క్లెయిమ్‌లకు ప్రాధాన్యత ఇవ్వడానికి కంపెనీ ప్రత్యేక క్లెయిమ్‌ల పరిష్కార డెస్క్‌ను ఏర్పాటు చేసింది. బీమాకు సంబంధించి క్లెయిం ప్రక్రియలో జాప్యాన్ని తగ్గించి, నామినీలు, వారసులు లేదా పాలసీదారులు తమ క్లెయిమ్‌లను సమర్పించడానికి డాక్యుమెంటేషన్ ప్రక్రియను తగ్గించినట్టు బజాజ్ అలియాంజ్ శుక్రవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది.






