- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
LIC: ఎల్ఐసీ రికార్డు బోనస్
ఇది గతేడాది కేటాయించిన రూ.56,331 కోట్లతో పోలిస్తే సుమారు 6 శాతం ఎక్కువ.

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) 2025-26 ఆర్థిక సంవత్సరానికి పాలసీదారులకు రికార్డు స్థాయిలో రూ.59,725 కోట్ల బోనస్ కేటాయించింది. ఇది గతేడాది కేటాయించిన రూ.56,331 కోట్లతో పోలిస్తే సుమారు 6 శాతం ఎక్కువ. అంతేకాకుండా, ఏడాది మధ్యలోనే రూ.8,356.71 కోట్ల మధ్యంతర బోనస్‌ను కూడా చెల్లించింది. ఈ మొత్తం అర్హులైన పాలసీదారుల ఖాతాల్లో జమై, పాలసీ మెచ్యూరిటీ లేదా క్లెయిమ్ సమయంలో ప్రయోజనాల్లో భాగంగా అందుతుంది. గత ఆర్థిక సంవత్సరంలో ఎల్ఐసీ పరిశ్రమలో తన ఆధిపత్యాన్ని కొనసాగించింది. దేశవ్యాప్తంగా మొదటి సంవత్సరం ప్రీమియం ఆదాయంలో 56.66 శాతం, విక్రయించిన మొత్తం పాలసీల్లో 65.16 శాతం వాటాను దక్కించుకుంది. ఇదే సమయంలో కొత్త వ్యాపార విలువ (వీఎన్‌బీ) 42 శాతం పెరిగి రూ.14,179 కోట్లకు చేరగా, బీఎన్‌బీ మార్జిన్ 17.6 శాతం నుంచి 21.2 శాతానికి పెరగడం కంపెనీ లాభదాయకత బలపడుతున్న సంకేతంగా నిలిచింది. అధిక మార్జిన్ కలిగిన నాన్-పార్టిసిపేటింగ్ ఉత్పత్తుల అమ్మకాలు కూడా వేగంగా పెరగడంతో వార్షిక ప్రీమియం సమానం (ఏపీఈ) రూ.66,961 కోట్లకు చేరింది.






