- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
LG Electronics: చరిత్ర సృష్టించిన ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా.. ఏకంగా రూ.4 లక్షల కోట్ల బిడ్లు
ఈ స్థాయి డిమాండ్ ప్రధానంగా క్యూఐబీ(క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ బయ్యర్లు) అయిన బడా ఇన్వెస్టర్ల నుంచి వచ్చింది.

దిశ, బిజినెస్ బ్యూరో: ఎలక్ట్రానిక్స్ దిగ్గజం ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా ఐపీఓలో చరిత్ర సృష్టించింది. గురువారం ముగిసిన ఐపీఓలో కంపెనీకి రూ. 4 లక్షల కోట్లకు పైగా బిడ్లను అందుకున్న తొలి భారతీయ కంపెనీగా నిలిచింది. ఇది దేశ చరిత్రలోనే ఏ ఐపీఓకైనా ఇప్పటివరకు అత్యధికం. ఈ స్థాయి డిమాండ్ ప్రధానంగా క్యూఐబీ(క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ బయ్యర్లు) అయిన బడా ఇన్వెస్టర్ల నుంచి వచ్చింది. క్యూఐబీల్లో బ్యాంకులు, బీమా కంపెనీలు, మ్యూచువల్ ఫండ్‌లు, విదేశీ పెట్టుబడిదారులు ఉన్నారు. ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్ దేశంలో ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాల మార్కెట్‌లో విస్తృతమైన వ్యాపార సామర్థ్యాన్ని కలిగి ఉంది. దీంతో భవిష్యత్తులో కంపెనీ మరింత విస్తరించనుందని, లాభాలు తెచ్చిపెడుతుందని ఇన్వెస్టర్లు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే షేర్లను బుక్ చేసుకోవడానికి సిద్ధపడ్డారు. ఇన్వెస్టర్ల విశ్వాసం కారణంగానే మొత్తం బిడ్‌లను అందుకోవడంలో ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా రికార్డు నమోదు చేసింది. బీఎస్ఈ డేటా ప్రకారం, అక్టోబర్ 7న మొదలైన ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్ ఐపీఓ ప్రక్రియలో 65.06 లక్షలకు పైగా దరఖాస్తులను అందుకుంది. బిడ్డింగ్ మొత్తంలో సంస్థాగత బిడ్డర్ల నుంచి 166.51 రెట్ల దరఖాస్తులు రావడం గమనార్హం. వీరు వేసిన బిడ్ల విలువ రూ. 3.86 లక్షల కోట్లు. రిటైల్ పెట్టుబడిదారుల నుంచి మూడున్నర రెట్లకు పైగా బుకింగ్‌లు వచ్చాయి.






