స్టాక్ ఎక్స్ఛేంజ్ లో లిస్ట్ అయిన LG ఎలక్ట్రానిక్స్ ఇండియా లిమిటెడ్‌

by Malleboina Mahesh |

LG ఎలక్ట్రానిక్స్ ఇండియా లిమిటెడ్‌ ఈ రోజు అధికారికంగా నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE), బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE) లో లిస్ట్ చేసింది.

స్టాక్ ఎక్స్ఛేంజ్ లో లిస్ట్ అయిన LG ఎలక్ట్రానిక్స్ ఇండియా లిమిటెడ్‌
X

దిశ, వెబ్ డెస్క్: LG ఎలక్ట్రానిక్స్ ఇండియా లిమిటెడ్‌ ఈ రోజు అధికారికంగా నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE), బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE) లో లిస్ట్ చేసింది. కంపెనీ షేర్స్ NSEలో ₹1,710.10కి, BSEలో ₹1,715కి ప్రారంభమయ్యాయి. ఇది ప్రతి షేరు కోసం నిర్ణయించిన ఇష్యూ ధర ₹1,140 కంటే 50% ఎక్కువగా ఉంది. ఈ శక్తివంతమైన లిస్టింగ్ ద్వారా పెట్టుబడిదారుల విశ్వాసం స్పష్టమవుతోందని అంతా భావిస్తున్నారు. ఇదే LG ఎలక్ట్రానిక్స్ ఇండియాను భారతదేశంలో టాప్ కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ కంపెనీలలో ఒకటిగా నిలబెట్టింది.

కాగా భారత దేశంలో ఎన్నో సంవత్సరాలుగా విజయవంతంగా కొనసాగుతున్న ఈ ఎల్‌జీ ఎలాక్ట్రానిక్స్.. ఇపో (Initial Public Offering) 2025 అక్టోబర్ 9న ముగిసింది. ఇందులో 10.18 కోట్ల షేర్స్(parent company LG Electronics Inc.)ను offer-for-sale ద్వారా విడుదల చేశారు. ఈ ఇపోకు అత్యధిక investor ఆకర్షణ లభించి. 54 రెట్లు కంటే ఎక్కువ సబ్‌స్క్రిప్షన్ రేట్‌ను సాధించింది. ఇది 2008 నుండి భారత్‌లో అత్యధిక సబ్‌స్క్రైబ్డ్ బిలియన్-డాలర్ ఇపోగా మారింది. ప్రారంభ గంటలో, LG ఎలక్ట్రానిక్స్ సిఇఓ William Cho, NSE సిఇఓ Ashish Chauhan కలిసి LG ఎలక్ట్రానిక్స్ ఇండియా లిమిటెడ్ ట్రేడింగ్ ప్రారంభించారు.

Next Story