LG Electronics India: ఐపీఓకు ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా.. సెబీకి దరఖాస్తు

by S Gopi |
LG Electronics India: ఐపీఓకు ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా.. సెబీకి దరఖాస్తు
X

దిశ, బిజినెస్ బ్యూరో: దక్షిణ కొరియాకు చెందిన కంపెనీలు భారత ఈక్విటీ మార్కెట్లలో ఎంట్రీకి ఆసక్తి చూపిస్తున్నాయి. ఇటీవలే దక్షిణ కొరియాకు చెందిన కార్ల తయారీ సంస్థ హ్యూండాయ్ మోటార్ ఇండియా ఐపీఓకు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఎలక్ట్రిక్స్ తయారీ దిగ్గజం ఎల్‌జీ ఎలక్ట్రాఇక్స్ ఇండియా విభాగం పబ్లిక్ ఆఫర్(ఐపీఓ) కోసం మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీకి దరఖాస్తు చేసుకుంది. శుక్రవారం సెబీకి తన డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ (డీఆర్‌హెచ్‌పీ)ని అందజేసింది. పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ ద్వారా షేర్లను విక్రయిస్తున్న కంపెనీ రూ. 10 ముఖ విలువతో మొత్తం 10.18 కోట్ల షేర్లను అమ్మకానికి పెట్టనుంది. పలు నివేదికల ప్రకారం ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా ఐపీఓ ద్వారా రూ. 15,237 కోట్ల వరకు నిధులను సమీకరించాలని భావిస్తోంది. ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా దేశీయంగా గృహోపకరణాలు, వినియోగ ఉత్పత్తులను విక్రయిస్తోంది. ఈ విభాగంలో కంపెనీ మార్కెట్ వాటా గణనీయంగా ఉంది. దేశంలోనే కాకుండా అంతర్జాతీయంగా కూడా బీ2సీ, బీ2బీ కస్టమర్లకు తన ఉత్పత్తులను విక్రయిస్తోంది. 2024, మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో కార్యకలాపాల ద్వారా ఎల్‌జీ ఎలక్ట్రానిక్ ఇండియా రూ.64,087.97 కోట్ల ఆదాయం నమోదు చేసింది.

Advertisement

Next Story

Most Viewed