Jobs: ఏంటి ఇది నిజమేనా..? పార్ట్ టైం గవర్నమెంట్ జాబ్స్ ఉన్నాయా.. ఎలా అప్లై చేయాలో తెలుసుకోండి

by Vennela |

Part-time government jobs: మీరు ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారా?

Jobs: ఏంటి ఇది నిజమేనా..? పార్ట్ టైం గవర్నమెంట్ జాబ్స్ ఉన్నాయా.. ఎలా అప్లై చేయాలో తెలుసుకోండి
X

దిశ, వెబ్ డెస్క్: Part-time government jobs: మీరు ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారా? అది కూడా ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారా? అయితే నిరుద్యోగులకు ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం నిరుద్యోగుల కోసం అనేక రకాల స్కీములు ప్రవేశపెడుతోంది. ఇప్పటికే స్వయం ఉపాధి కోసం అనేక పథకాలు ప్రారంభించగా, ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగులకు ఉద్యోగం కల్పించేందుకు కూడా ఒక సరికొత్త పోర్టల్ ను మీ ముందుకు తీసుకొని వచ్చింది. ఈ పోర్టల్ ద్వారా మీరు నేరుగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు ప్రైవేటు ఉద్యోగాలకు కూడా అప్లై చేసుకున్న అవకాశం లభిస్తుంది.

తాజాగా కేంద్ర ప్రభుత్వం తయారు చేసిన ఒక వెబ్ సైట్. నిరుద్యోగులకు ఉద్యోగం వెతికి పెట్టడంలో ఎంతో సహాయపడుతుంది. కేంద్ర ప్రభుత్వ లేబర్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నడిచే National Career Service (NCS) అధికారిక వెబ్ సైట్ ద్వారా నిరుద్యోగులకు ఉద్యోగాలను కల్పించడంలో సహాయపడుతోంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్నటువంటి అనేక కెరీర్ గైడెన్స్ సైట్లతో పోటీగా ఈ వెబ్ సైట్ నిరుద్యోగులకు ఉద్యోగాలను వెతికి పెట్టడంలో సహాయపడుతోంది.

అయితే ఇందులో ప్రభుత్వ ఉద్యోగాలు సైతం ఉన్న అందుబాటులో ఉన్నాయి. దాంతోపాటు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన లేదా కొనసాగిస్తున్న అనేక ప్రాజెక్టులకు పార్టీ టైం ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లు కూడా ఇందులో ఉంటాయి. ఈ వెబ్ సైట్ ద్వారా నిరుద్యోగులు తమ వివరాలతో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ చార్జీలు ఏమీ ఉండవు. ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు ప్రైవేటు ఉద్యోగాలు కూడా ఇందులో మీరు వెతుక్కోవచ్చు. మీ విద్యార్హతలకు తగినట్టుగా మీకు ఉద్యోగాలు ఇందులో సూచిస్తారు. దీన్నిబట్టి మీరు మీ ఉద్యోగాన్ని ఎంపిక చేసుకొని మీరు అప్లై చేసుకోవచ్చు. దీంతోపాటు కెరీర్ గైడెన్స్ కూడా ఇందులో లభిస్తుంది. అధికారిక వెబ్ సైట్ కోసం https://www.ncs.gov.in/ ఈ లింకు క్లిక్ చేయండి.


https://youtube.com/shorts/Dt8f4CGy7TU?si=x-se0YydJb8eUN-t


Next Story