- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
E Commerce: డార్క్ ప్యాటర్న్స్ నిబంధనలు పాటిస్తున్నట్టు ప్రకటించిన ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లు
డార్క్ ప్యాటర్న్స్ మార్గదర్శకాలు-2023కు అనుగుణంగా తమ ప్లాట్‌ఫామ్స్ ఉన్నాయని ఆయా కంపెనీలు స్వయంగా..

దిశ, బిజినెస్ బ్యూరో: దేశ డిజిటల్ మార్కెట్‌లో వినియోగదారుల రక్షణకు కీలకమైన ముందడుగు పడింది. దేశవ్యాప్తంగా 26 ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లు స్వయంగా డార్క్ ప్యాటర్న్స్ నిబంధనలు అమలు చేసినట్టు వెల్లడించాయి. డార్క్ ప్యాటర్న్స్ ప్రివెన్షన్ అండ్ రెగ్యులేషన్ మార్గదర్శకాలు-2023కు అనుగుణంగా తమ ప్లాట్‌ఫామ్స్ ఉన్నాయని ఆయా కంపెనీలు స్వీయంగా చెప్పాయని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ గురువారం ప్రకటనలో పేర్కొంది. ఇందులో జొమాటో, జెప్టో, జియో మార్ట్, స్విగ్గీ, బిగ్‌బాస్కెట్, ఫ్లిప్‌కార్ట్, మింత్రా, వాల్‌మార్ట్, మేక్‌మైట్రిప్, బ్లింకిట్ సహా మొత్తం 26 ప్లాట్‌ఫామ్స్ ఉన్నాయి. కంపెనీలు అంతర్గతంగా, థర్డ్ పార్టీ ఆడిట్ ద్వారా డార్క్ ప్యాటర్న్స్‌ను గుర్తించి తొలగించాయి. వినియోగదారులను తప్పుదారి పట్టించేలా ప్లాట్‌ఫామ్స్ రివ్యూలలో ఫేక్ ఎమర్జెన్సీ అలర్ట్స్ ఇవ్వడం, నెగెటివ్ రివ్యూలను కనబడకుండా చేయడం, సబ్‌స్క్రిప్షన్ ట్రాపింగ్, తప్పుడు ధరలతో ఆఫర్లు చూపించడం లాంటి డార్క్ ప్యాటర్న్‌లపై ప్రభుత్వం చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే.






