ఉద్యోగుల తొలగింపు జాబితాలో చేరనున్న Google!

by Disha Web Desk 6 |
ఉద్యోగుల తొలగింపు జాబితాలో చేరనున్న Google!
X

న్యూఢిల్లీ: ఇప్పటికే మెటా, ట్విటర్, అమెజాన్ వంటి గ్లోబల్ దిగ్గజ కంపెనీలు భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగించిన సంగతి తెలిసిందే. తాజాగా వీటి జాబితాలోకి గూగుల్ సైతం చేరనుంది. గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ త్వరలో పనితీరు మెరుగ్గా లేని దాదాపు 10,000 మంది ఉద్యోగులను తొలగించేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే కసరత్తు మొదలైందని, పనితీరు పేలవంగా ఉన్న వారి ర్యాంకులను ఇవ్వాలని మేనేజర్లను కోరినట్టు సమాచారం.

గూగుల్ తన మొత్తం ఉద్యోగుల్లో 6 శాతం మంది సాగనంపేందుకు ప్రణాళిక కలిగి ఉంది. గూగుల్ ర్యాంకింగ్ ఆధారంగా తక్కువ ర్యాంక్ ఉన్న ఉద్యోగులను తొలగించనుంది. ఈ ఏడాది మూడో త్రైమాసికంలో గూగుల్ సంస్థ ఆదాయం గతేడాది కంటే 6 శాతం క్షీణించిన సంగతి తెలిసిందే. ప్రతికూల మార్కెట్ పరిస్థితులతో పాటు ఖర్చులను తగ్గించుకోవాల్సిన రావడం, కంపెనీ ఆదాయం పడిపోతుండటం గూగుల్ తాజా నిర్ణయానికి కారణమని టెక్ వర్గాలు భావిస్తున్నాయి. అయితే, ఉద్యోగుల తొలగింపునకు సంబంధించి ఆల్ఫాబెట్ ఇంకా అధికారికంగా స్పందించాల్సి ఉంది.


Next Story