- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టెక్ రంగంలో మళ్లీ లేఆఫ్స్ సెగ: మెటాలో 8 వేల మంది ఉద్యోగుల తొలగింపు!
మెటా సంస్థలో 8,000 మంది ఉద్యోగుల తొలగింపునకు ముహూర్తం ఖరారైంది.

దిశ, వెబ్‌డెస్క్: ఫేస్‌బుక్ (Facebook) మాతృ సంస్థ ‘మెటా’ (Meta) మరోసారి భారీ ఎత్తున ఉద్యోగులను తొలగిస్తున్నట్లుగా ప్రకటించింది. తన గ్లోబల్ వర్క్‌ఫోర్స్‌లో సుమారు 10 శాతం అంటే 8,000 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లుగా సంస్థ అధికారికంగా ధృవీకరించింది. ఈ మేరకు ఆ సంస్థ చీఫ్ పీపుల్ ఆఫీసర్ జనెల్ గేల్ (VJanelle Gayle) ఉద్యోగులకు అంతర్గత మెమోలు పంపారు. అయితే, మే 20న ఈ లేఆఫ్స్ ప్రక్రియ అధికారికంగా ప్రారంభం కానుంది. దీంతో సదరు ఉద్యోగులకు ఆ రోజున వారి వ్యక్తిగత, వర్క్ ఈమెయిల్ ఐడీలకు సమాచారం అందనుంది.
లేఆఫ్స్‌కు కారణం ఇదే..
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో పెట్టుబడులను పెంచడం, సంస్థ పనితీరును మరింత సమర్థవంతంగా మార్చడం కోసమే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లుగా మెటా తెలిపింది. 8,000 మంది ప్రస్తుత ఉద్యోగులతో పాటు, భర్తీ చేయాలని అనుకున్న మరో 6,000 ఓపెన్ రోల్స్‌ను కూడా రద్దు చేస్తున్నట్లుగా సంస్థ ప్రకటించింది. భవిష్యత్తులో ఈ లేఆఫ్స్ 20 శాతానికి అంటే మరో 8 వేల మంది ఉద్యోగులకు పెరిగే అవకాశం ఉందని సమాచారం. ఉద్యోగం నుంచి తొలగింపునకు గురైన అమెరికా ఉద్యోగులకు 16 వారాల బేస్ పేతో పాటు, పనిచేసిన ప్రతి ఏడాదికి అదనంగా రెండు వారాల వేతనం ఇవ్వనున్నారు. అదేవిధంగా 18 నెలల పాటు హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని కూడా కల్పిస్తారు. భారత్ సహా ఇతర దేశాల్లో ఆయా దేశాల చట్టాల ప్రకారం ఈ ప్యాకేజీలు ఉంటాయని మెటా వెల్లడించింది.






