Lava: రూ. 9,999కే కొత్త డ్రాగన్ 5జీ స్మార్ట్‌ఫోన్ విడుదల చేసిన లావా

by S Gopi |

స్నాప్‌డ్రాగన్ 4 జెనరేషన్ 2 చిప్ ప్రాసెసర్‌తో పనిచేసే ఈ స్మార్ట్‌ఫోన్ రూ. 9,999 ధరకే లభిస్తుంది.

Lava: రూ. 9,999కే కొత్త డ్రాగన్ 5జీ స్మార్ట్‌ఫోన్ విడుదల చేసిన లావా
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ లావా మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను విడుదల చేసింది. బడ్జెట్ ధరలో 5జీ స్మార్ట్‌ఫోన్ తెచ్చే లక్ష్యంతో బ్లేజ్ డ్రాగన్ 5జీని తీసుకొచ్చింది. స్నాప్‌డ్రాగన్ 4 జెనరేషన్ 2 చిప్ ప్రాసెసర్‌తో పనిచేసే ఈ స్మార్ట్‌ఫోన్ రూ. 9,999 ధరకే లభిస్తుంది. 4జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ వేరియంట్‌తో వచ్చిన ఈ ఫోన్ 5,000ఎంఏహెచ్ బ్యాటరీతో 18 వాట్ ఛార్జరింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. ఫోన్ వెనుక భాగంలో 50ఎంపీ కెమెరా, ముందు భాగంలో సెల్ఫీ కోసం 8ఎంపీ కెమెరా వస్తుంది. ఆగస్టు 1 నుంచి అమెజాన్‌లో ఈ ఫోన్ సేల్‌కు వస్తుందని, కస్టమర్లు లాంచ్ ఆఫర్‌లో భాగంగా అదనంగా రూ. 1,000 ఎక్స్ఛేంజ్ బోనస్‌ను కూడా పొందవచ్చని కంపెనీ వెల్లడించింది. 6.74 అంగుళాల హెచ్‌డీ ప్లస్ స్మూత్ డిస్‌ప్లే, 120హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్‌తో ఫోన్ పనిచేస్తుంది. లావా బ్లేజ్ డ్రాగన్ 5జీలో ఆండ్రాయిడ్ 15 ఇచ్చిన కంపెనీ దీనికి ఒక అప్‌డేట్ మాత్రమే ఇవ్వనుంది. ఓఎస్ అప్‌డేట్ కూడా రెండేళ్ల వరకే ఇస్తామని తెలిపింది. ఈ ఫోన్ సర్వీస్‌ని ఇంటివద్దే అందించే సౌకర్యం కూడా కల్పిస్తున్నామని కంపెనీ పేర్కొంది.

Next Story