Pension scheme: రైతుల కోసమే ఈ పెన్షన్ స్కీమ్‌.. నెలకు రూ.3000 మీ ఖాతాలో వేసే ఈ స్కీమ్‌పై ఓ లుక్కేయండి

by Vennela |

PM Kisan Mandhan Yojana: కేంద్రంలోని మోడీ సర్కార్ రైతుల కోసం ఎన్నో పథకాలను అమలు చేస్తోంది.

Pension scheme: రైతుల కోసమే ఈ పెన్షన్ స్కీమ్‌.. నెలకు రూ.3000 మీ ఖాతాలో వేసే ఈ స్కీమ్‌పై ఓ లుక్కేయండి
X

దిశ, వెబ్ డెస్క్: PM Kisan Mandhan Yojana: కేంద్రంలోని మోడీ సర్కార్ రైతుల కోసం ఎన్నో పథకాలను అమలు చేస్తోంది. ఇది నేరుగా రైతులకు ప్రయోజనం చేకూరుస్తుంది. అలాంటి పథకం ప్రధానమంత్రి కిసాన్ మంధన్ యోజన(PM Kisan Mandhan Yojana). ఈ స్కీము కింద రైతులకు 60ఏళ్లు నిండిన తర్వాత ప్రతినెలా రూ. 3000 పెన్షన్ అందజేస్తుంది. ఈ స్కీం గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

దేశానికే రైతులే వెన్నుముక. అలాంటి రైతులకు వృద్ధ్యాప్యంలో సహాయం అందించాలని ఈ స్కీమును రూపొందించారు. కేంద్ర ప్రభుత్వం 2019లో ఈ స్కీమును ప్రారంభించింది. చిన్న, సన్నకారు రైతులకు ఆర్థిక భద్రత కల్పించడమే ఈ స్కీము లక్ష్యం. పంట సాగు చేస్తున్న ఈ రైతు అయినా సరే ఈ స్కీము(scheme) ప్రయోజనం పొందవచ్చు. 18సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల మధ్య ఉన్న రైతులందరూ ఈ స్కీముకు దరఖాస్తు చేసుకోవచ్చు. బ్యాంక్ అకౌంట్ ద్వారా రైతులు వారి వయస్సును బట్టి రూ. 55 నుండి రూ. 200 వరకు నెలలవారీ ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. తద్వారా మీరు పెన్షన్ పొందేందుకు అర్హులు అవుతారు.

పంట సాగు చేసే వయస్సు అయిపోయిన తర్వాత రైతులకు ఆర్థిక భరోసా కల్పించడం చాలా ముఖ్యం. అందుకే 60ఏళ్లు నిండిన తర్వాత రైతులకు ప్రతినెలా రూ. 3000 పెన్షన్ అందిస్తారు. ఒకవేళ వ్యవసాయం చేస్తూ ఆ రైతు మరణించినట్లయితే అతని భార్యకు నెలకు రూ. 1500 పెన్షన్ లభిస్తుంది. దీంతో కుటుంబానికి కొంత భరోసా కల్పించినట్లు అవుతుందని ప్రభుత్వం ఉద్దేశ్యం.

ఈ స్కీం కోసం దరఖాస్తు చేసుకునేందుకు మీ దగ్గరలోని మీ సేవా కేంద్రానికి లేదా అధికారిక వెబ్ సైట్ www.pmkmy.gov.in ద్వారా మీరు దరఖాస్తు చేసుకోవచ్చు. వెబ్ సైట్ కు లాగిన్ అయిన తర్వాత అవసరమైన మొత్తం సమాచారాన్ని ఇవాల్సి ఉంటుంది. తప్పుగా నమోదు చేసినట్లయితే మీకు చివరిలో పెన్షన్ నిలిచిపోయే ఛాన్స్ ఉంటుంది. అలాగే మొదటే రిజక్ట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. ఫారమ్ పూర్తి చేసిన తర్వాత జనరేట్ ఓటీపీ పై క్లిక్ చేసి ఓటీపీని ఎంటర్ చేయాలి. ఆ తర్వాత సబ్‌మిట్ బటన్ పై క్లిక్ చేసి దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయాలి.

Next Story