Kia Electric Car: కియా నుంచి మరో కారు... సింగిల్ ఛార్జ్ తో 490 కిమీ !

by velandi.Saikiran |

ఇండియన్ మార్కెట్లోకి అనేక రకాల ఎలక్ట్రిక్ కార్లు ( Electric cars) వస్తున్న సంగతి తెలిసిందే. వినియోగదారులకు

Kia Electric Car: కియా నుంచి మరో కారు... సింగిల్ ఛార్జ్ తో 490 కిమీ !
X

దిశ, వెబ్ డెస్క్: ఇండియన్ మార్కెట్లోకి అనేక రకాల ఎలక్ట్రిక్ కార్లు ( Electric cars) వస్తున్న సంగతి తెలిసిందే. వినియోగదారులకు తగ్గట్టుగానే... మైలేజ్ ఎక్కువ ఇచ్చే కార్లను కంపెనీలు కూడా లాంచ్ చేస్తున్నాయి. మైలేజ్ ఎక్కువ ఇవ్వడమే కాకుండా సామాన్యులు కూడా కొనుగోలు చేసేలా కార్ల ధరలను ఫిక్స్ చేస్తున్నాయి కంపెనీలు. అయితే ఈ నేపథ్యంలోనే కియా (Kia) నుంచి మరో ఎలక్ట్రిక్ కారు లాంచ్ అయింది. కియా క్యారెన్స్​ క్లావిస్​ (Kia Carens Clavis EV) పేరుతో కొత్త ఎలక్ట్రిక్ వాహనాన్ని తీసుకువచ్చింది.

ఈ ఎలక్ట్రిక్ కారులో రెండు బ్యాటరీల ప్యాక్ ఆప్షన్ కూడా ఉండనుంది. ఈ కారు ఒక్కసారి ఫుల్ ఛార్జింగ్ పెడితే.... 490 కిలో మీటర్ల మైలేజ్ ఇస్తుందని కంపెనీ వెల్లడించింది. అయితే ఇది పెద్ద బ్యాటరీ ప్యాక్ వేరియంట్ లో మాత్రమేనని పేర్కొంది. ఇక చిన్న బ్యాటరీ ప్యాక్ వేరియంట్ సింగిల్ చార్జింగ్ తో దాదాపు 404 కిలోమీటర్ల మైలేజ్ వస్తుందని తెలిపింది.

ఇక ఈ కారు ధర 17.99 లక్షల నుంచి ప్రారంభమవుతుందని తెలిపింది. 24.49 లక్షల వరకు ఈ కారు ధర ఉంటుందని వివరించింది. ఎక్స్ షోరూం ప్రకారమే ఈ ధరలు. ప్రాంతం మారిన కొద్దీ ధరలు కూడా మారుతూ ఉంటాయి. అలాగే ఈ కొత్త మోడల్ కియా క్యారెన్స్​ క్లావిస్​ కారుకు... ఎల్ఈడి కనెక్టెడ్ DRL లు, ఐస్ క్యూబ్ ఎల్ఈడి హెడ్ లాంప్స్ అలాగే 17 అంగుళాల క్రిస్టల్ కట్ డ్యూయల్ టోన్ అల్లాయ్ వీల్స్ కూడా అందిస్తున్నారు.

Next Story