కార్లు కొనుగోలు చేసే వారికి శుభవార్త.. ఏకంగా రూ.2 లక్షలు డిస్కౌంట్.. వివరాలు ఇవే

by velandi.Saikiran |

సెల్టోస్ ( Kia Seltos) మోడల్ కారు పై రెండు లక్షల డిస్కౌంట్ అందిస్తున్నారు. ఈ కారు 11 లక్షల నుంచి 20 లక్షల మధ్య ఉంటుంది.

కార్లు కొనుగోలు చేసే వారికి శుభవార్త.. ఏకంగా రూ.2 లక్షలు డిస్కౌంట్.. వివరాలు ఇవే
X

దిశ‌, వెబ్ డెస్క్‌: కార్లు కొనుగోలు చేసే వారికి అదిరిపోయే శుభవార్త చెప్పింది కియా ఇండియా. ఏకంగా ఒక్కో కారుపై లక్ష నుంచి రెండు లక్షల వరకు డిస్కౌంట్ ఇస్తోంది కియా. జీఎస్టీ స్లాబ్ మార్పు అలాగే దసరా పండుగ డిస్కౌంట్ కింద... ధరలు తగ్గిస్తోంది కియా ఇండియా. రెండు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణలో ఈ రెండు లక్షల ఆఫర్ ప్రకటించారు.

ముఖ్యంగా సెల్టోస్ ( Kia Seltos) మోడల్ కారు పై రెండు లక్షల డిస్కౌంట్ అందిస్తున్నారు. ఈ కారు 11 లక్షల నుంచి 20 లక్షల మధ్య ఉంటుంది. బేస్ అలాగే, టాప్ ఎండ్ మోడల్ కార్లు ఉన్నాయి. అలాగే... కియా కు సంబంధించిన కారెన్స్ క్లావిస్ (Kia Carens Clavis) కారుపై 1.33 లక్షల డిస్కౌంట్ అందిస్తున్నారు. మరో కారు కారెన్స్ పై 1.02 లక్షల వరకు డిస్కౌంట్ అందుబాటులో ఉంటుంది. అయితే సెప్టెంబర్ 22వ తేదీ వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని కంపెనీ వెల్లడించింది. ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ ఆఫర్... ఉంటుందని...కానీ ధ‌ర‌ల్లో మార్పు ఉంటుంద‌ని తెలిపింది కంపెనీ.

Next Story