ఇకపై రైల్వే స్టేషన్లో KFC, మెక్ డొనాల్డ్స్

by Muthe.Rajitha |

ఇకపై దేశవ్యాప్తంగా ఉన్న రైల్వే స్టేషన్లలో మెక్‌డొనాల్డ్స్, కేఎఫ్‌సీ, పిజ్జా హట్, బాస్కిన్ రాబిన్స్, బికనీర్‌వాలా, హల్దీరామ్స్ వంటి ప్రీమియం బ్రాండ్ క్యాటరింగ్ ఔట్‌లెట్స్ అందుబాటులోకి రానున్నాయి.

ఇకపై రైల్వే స్టేషన్లో KFC, మెక్ డొనాల్డ్స్
X

దిశ, వెబ్ డెస్క్ : ఇకపై దేశవ్యాప్తంగా ఉన్న రైల్వే స్టేషన్లలో మెక్‌డొనాల్డ్స్, కేఎఫ్‌సీ, పిజ్జా హట్, బాస్కిన్ రాబిన్స్, బికనీర్‌వాలా, హల్దీరామ్స్ వంటి ఔట్‌లెట్స్ అందుబాటులోకి రానున్నాయి. సౌత్ సెంట్రల్ రైల్వే చేసిన ప్రతిపాదన ఆధారంగా క్యాటరింగ్ పాలసీని సవరిస్తూ రైల్వే బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. తాజాగా ఆయా జోన్లకు సూచనలు చేస్తూ సర్క్యులర్ జారీ చేసింది. సింగిల్ బ్రాండ్ ఔట్‌లెట్లను కంపెనీలు స్వయంగా నడపవచ్చు లేదా ఫ్రాంచైజీల ద్వారా నిర్వహించవచ్చు. అయితే ఎంపిక విధానం మాత్రం ప్రస్తుత ఈ-ఆక్షన్ విధానంపైనే జరుగుతుంది.

ఈ ఔట్‌లెట్లకు ఐదేళ్ల ఒప్పందం ఉంటుంది. కనీస లైసెన్స్ ఫీజు ప్రస్తుత నిబంధనల ప్రకారమే కొనసాగుతాయి. సింగిల్-బ్రాండ్ ఔట్‌లెట్‌లను ఆమోదించే ముందు ప్రయాణికుల డిమాండ్, అందుబాటులో ఉన్న స్థలం, సాధ్యాసాధ్యాలు వంటి అంశాలను అంచనా వేయాలని రైల్వే జోన్‌లకు సూచించారు. అయితే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలు, స్వాతంత్ర్య సమరయోధులు, రైల్వే భూసమీకరణలో భూమి కోల్పోయిన వారికి ఉన్న కోటాపై ఈ ప్రీమియం ఔట్‌లెట్ల వల్ల ప్రభావం పడదు.

Next Story