- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
GST: జీఎస్టీలో రెండు శ్లాబులకు ఆమోదం తెలిపిన మంత్రుల బృందం
12, 28 శాతం శ్లాబులను రద్దు చేసి, 5, 18 శాతం శ్లాబులను కొనసాగించడానికి జీఓఎం ఆమోదం తెలిపింది.

దిశ, బిజినెస్ బ్యూరో: చాలా కాలంగా ఎదురుచూస్తున్న వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) సంస్కరణలకు కీలక ముందడుగు పడింది. గురువారం జీఎస్టీ రేటు హేతుబద్ధీకరణలో భాగంగా కేంద్రం ప్రతిపాదినైన రెండు శ్లాబులకు మంత్రుల బృందం (జీఓఎం) అంగీకరించింది. 12, 28 శాతం శ్లాబులను రద్దు చేసి, 5, 18 శాతం శ్లాబులను కొనసాగించడానికి జీఓఎం ఆమోదం తెలిపింది. ఈ మేరకు బీహార్ ఉప ముఖ్యమంత్రి, రేట్ల హేతుబద్దీకరణ కన్వీనర్ సామ్రాట్ చౌదరీ చెప్పారు. అలాగే, కేంద్రం ప్రతిపాదించిన వాటిలో పొగాకు, ఆల్కహాల్ వంటి సిన్ గూడ్స్‌ను, లగ్జరీ వస్తువులను 40 శాతం పన్ను పరిధిలోకి తీసుకురావడం కూడా ఉందని జీఓఎం పేర్కొంది. దీంతో, గతంలో 12 శాతం పన్ను పరిధిలో ఉన్న 99 శాతం వస్తువులు ఇప్పుడు 5 శాతం శ్లాబ్ కిందకు మారుతాయి. అదేవిధంగా, 28 శాతం శ్లాబ్ కింద ఉన్న దాదాపు 90 శాతం వస్తువులు 18 శాతానికి చేరుతాయి. అయితే, కొత్త జీఎస్టీ శ్లాబుల కారణంగా కేంద్రం, రాష్ట్రాలకు జరిగే ఆదాయ నష్టం గురించి కేంద్రం ప్రస్తావించలేదని జీఓఎం వెల్లడించింది. కొత్త జీఎస్టీతో రోజువారీ వస్తువులపై పన్ను రేటును తగ్గించడం ద్వారా ఇంటి ఖర్చులు, రైతులు, మధ్యతరగతికి ఉపశమనం కలిగించవచ్చని కేంద్రం తెలిపింది. మందులు, ప్రాసెస్ చేసిన ఆహారం, దుస్తులు, పాదరక్షలు, అనేక గృహోపకరణాలు 5 శాతం శ్లాబుకు మారే అవకాశం ఉంది. పెద్ద గృహోపకరణాలు, టెలివిజన్లు, ఇతర మన్నికైన వస్తువులు ఇదివరకు ఉన్న 28 శాతం నుంచి 18 శాతం రేటు కిందకు వస్తాయి, ఇది మధ్యతరగతికి భారీ ఉపశమనమని కేంద్రం పేర్కొంది.






