- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సామాన్యులకు గుడ్ న్యూస్.. GST స్లాబులపై కీలక నిర్ణయం
ఢిల్లీ వేదికగా జరిగిన జీఎస్టీ కౌన్సిల్(GST Council) సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

X
దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ వేదికగా జరిగిన జీఎస్టీ కౌన్సిల్(GST Council) సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈనెల 22 నుంచి కొత్త జీఎస్టీ స్లాబ్ రేట్లు అమలు కానున్నాయి. 5, 18 శాతం స్లాబ్‌లు మాత్రమే కొనసాగించాలని, 12, 28 శాతం స్లాబ్‌లు తొలగించాలని నిర్ణయించారు. లగ్జరీ వస్తువులపై 40 శాతం పన్ను విధించనున్నారు. హెల్త్, లైఫ్ ఇన్సూరెన్స్‌లపై జీఎస్టీని పూర్తిగా రద్దుచేశారు. సమావేశం అనంతరం ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మీడియాతో మాట్లాడారు. నెక్ట్స్ జనరేషన్ సంస్కరణలకు ప్రధాని మోడీ శ్రీకారం చూట్టారు. పేదలు, రైతులను దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకున్నాం. సామాన్యులు వాడే వస్తులపై జీఎస్టీ బాగా తగ్గించామని నిర్మలా సీతారామన్ చెప్పారు. వ్యవసాయ, వైద్య రంగాలకు ఊరట కలిగించేలా నిర్ణయాలకు ఆమోదం తెలిపినట్లు చెప్పారు.
Next Story






