Jobs: నిరుద్యోగులకు భారీ శుభవార్త.. జస్ట్ 8వ తరగతి పాస్ అయితే చాలు రూ.25 లక్షలు మీ సొంతం!

by Vennela |

Jobs: కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు అనేక రకాల పథకాలను ప్రవేశపెట్టింది.

Jobs: నిరుద్యోగులకు భారీ శుభవార్త.. జస్ట్ 8వ తరగతి పాస్ అయితే చాలు రూ.25 లక్షలు మీ సొంతం!
X

దిశ, వెబ్ డెస్క్: Jobs: కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు అనేక రకాల పథకాలను ప్రవేశపెట్టింది. ముఖ్యంగా ఉన్నత విద్య లేకపోయినప్పటికీ సొంత కాళ్లపై నిలబడాలని ఆశించే యువతకు ఉపాధి కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం Prime Minister’s Employment Generation Programme (PMEGP) స్కీం 2008వ సంవత్సరంలో ప్రారంభించింది.

PMEGP స్కీం ప్రస్తుతం 2025లో కూడా అమలులో ఉంది. ఈ స్కీంను 2025-26 వరకు కొనసాగించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ స్కీంను కేంద్ర ప్రభుత్వ మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖకు చెందిన ఖాదీ, గ్రామీణ పరిశ్రమల కమిషన్ (KVIC) నిర్వహిస్తోంది. దీని ప్రధాన లక్ష్యం గ్రామీణ పట్టణ నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించడమే అని చెప్పవచ్చు.

ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలను పట్టణ ప్రాంతాలను చిరు వ్యాపారాలు ప్రారంభించడానికి ఈ స్కీమ్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ స్కీం ద్వారా ఆర్థిక సహాయం అందించడానికి కనీస వయస్సు 18 సంవత్సరాలుగా నిర్ణయించారు. అలాగే కనీసం 8వ తరగతి పాస్ అయిన వారికి పది లక్షల కన్నా ఎక్కువ రుణం అంటే 25 లక్షల వరకు రుణం కేటాయించే అవకాశం ఉంటుంది. ఎనిమిదవ తరగతి కన్నా తక్కువ చదివిన వారికి పది లక్షల కన్నా తక్కువ రుణం లభిస్తుంది.

అయితే ఈ లోన్ కోసం అప్లై చేయడానికి వ్యక్తులు, స్వయం సహాయక గ్రూపులు, ట్రస్ట్‌లు, రిజిస్ట్రర్‌డ్ సొసైటీలకు కూడా అర్హత ఉంది. ఎవరైతే తయారీ రంగంలో వ్యాపారం చేయాలనుకుంటారో వారికి 25 లక్షల వరకు రుణం లభిస్తుంది. ఇక సర్వీసెస్ రంగంలో అయితే 10 లక్షల వరకు లోన్ లభిస్తుంది. SC, ST, OBC, మహిళలు, దివ్యాంగులకు పట్టణాల్లో 25% రుణంపై సబ్సిడీ లభిస్తుండగా, గ్రామీణ ప్రాంతాల్లో 35% సబ్సిడీ లభిస్తుంది. మీరు ఈ స్కీం అప్లై చేసుకోవడానికి పాన్ కార్డు, ఆధార్, బ్యాంకు అకౌంట్ తప్పనిసరిగా ఉండాలి. అలాగే ప్రాజెక్ట్ నివేదిక కూడా ఉండాలి. పూర్తి వివరాల కోసం www.kviconline.gov.in వెబ్ సైట్ విజిట్ చేయాలి.

Next Story