టాటా ఎలక్ట్రిక్ కార్లపై అదిరిపోయే ఆఫర్.. లక్ష వరకు డిస్కౌంట్!

by velandi.Saikiran |

ఇండియాలో కార్ల వినియోగం విపరీతంగా పెరిగింది. పెట్రోల్ అలాగే డీజిల్ ధరలు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో... చాలామంది

టాటా ఎలక్ట్రిక్ కార్లపై అదిరిపోయే ఆఫర్.. లక్ష వరకు డిస్కౌంట్!
X

దిశ, వెబ్ డెస్క్: ఇండియాలో కార్ల వినియోగం విపరీతంగా పెరిగింది. పెట్రోల్ అలాగే డీజిల్ ధరలు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో... చాలామంది ఎలక్ట్రిక్ వాహనాలకు మొగ్గు చూపుతున్నారు. దీనికి తగ్గట్టుగానే కంపెనీలు రకరకాల కార్లను లాంచ్ చేస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో టాటా మోటార్స్ అదిరిపోయే శుభవార్త చెప్పింది. తమ ఎలక్ట్రిక్ కార్ల పై డిస్కౌంట్ ప్రకటించింది.

గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం.. 15% సేల్స్ తగ్గాయని.. ఈసారి డిస్కౌంట్ ప్రకటించింది. ఇందులో భాగంగానే హారియర్ ఎలక్ట్రిక్ కారుపై లక్ష రూపాయల వరకు డిస్కౌంట్ అందించేందుకు సిద్ధమైంది. అయితే ఇందులో కొన్ని మోడల్స్ పైనే ఈ ఆఫర్ ఉంది. కొన్ని నగరాలకు మాత్రమే ఈ ఆఫర్లు పరిమితం చేసింది. అదే సమయంలో టాటా టియాగో ఎలక్ట్రిక్ కారు లాంగ్ రేంజ్ మోడల్ పైన 40,000 వరకు డిస్కౌంట్ అందిస్తున్నారు.

అంతేకాదు వినియోగదారులు తమ పాత కారును అమ్మేస్తే 20,000 డిస్కౌంట్ కూడా ఇవ్వనున్నారు. ఎక్స్చేంజ్ బోనస్ కింద 20,000 పొందే అవకాశాలు ఉన్నట్లు ప్రకటన చేసింది. అంతేకాదు టాటా నెక్సన్ EV పైన 30 వేల ఎక్స్చేంజ్ బోనస్ అందిస్తున్నారు. అదనంగా ఆరు నెలల పాటు టాటా పవర్ చార్జింగ్ స్టేషన్ లో 1000 యూనిట్ల ఉచిత చార్జింగ్ కూడా ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. టాటా కరువు ఎలక్ట్రానిక్ కారుపై... 50 వేల వరకు ఎక్స్చేంజి బోనస్ కూడా అందిస్తున్నారు. ఈ ఆఫర్ కొన్ని రోజుల వరకు మాత్రమే ఉంటుందని ప్రకటన చేశారు.

Next Story