Johnson & Johnson: జాన్సన్ అండ్ జాన్సన్‌కు రూ. 8,582 కోట్ల భారీ జరిమానా విధించిన అమెరికా కోర్టు

by S Gopi |

ఓ మహిళ కుటుంబానికి ఇచ్చిన తీర్పులో 966 మిలియన్‌ డాలర్లు పరిహారంగా చెల్లించాలని జ్యూరీ తీర్పు వెలువరించింది.

Johnson & Johnson: జాన్సన్ అండ్ జాన్సన్‌కు రూ. 8,582 కోట్ల భారీ జరిమానా విధించిన అమెరికా కోర్టు
X

దిశ, బిజినెస్ బ్యూరో: 15 ఏళ్ల నాటి కేసులో బేబీ పౌడర్లను తయారు చేసే జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ కంపెనీకి లాస్‌ ఏంజెలెస్‌ జ్యూరీ భారీ జరిమానా విధించింది. కంపెనీ తయారు చేసిన బేబీ పౌడర్‌ ఉత్పత్తులను వాడిన కారణంగా క్యాన్సర్‌ వస్తున్నట్టు నిర్ధారణ అయ్యిందని, దానివల్ల మెసోథెలియోమా వ్యాధికి గురై మరణించిన ఓ మహిళ కుటుంబానికి ఇచ్చిన తీర్పులో 966 మిలియన్‌ డాలర్లు (8,582 కోట్ల రూపాయలు) పరిహారంగా చెల్లించాలని జ్యూరీ తీర్పు వెలువరించింది. కాలిఫోర్నియాకు చెందిన మే మూర్‌ అనే మహిళ 2021లో క్యాన్సర్‌తో మరణించింది. కంపెనీకి చెందిన బేబీ పౌడర్‌ను జీవితాంతం వాడటం వల్లే తనకు క్యాన్సర్ వచ్చిందని సదరు మహిళ కుటుంబం ఆరోపించింది. మొత్తం జరిమానాలో 16 మిలియన్ డాలర్లను పరిహారంగానూ, కంపెనీ చర్యలకు వ్యతిరేకంగా బలమైన సందేశం పంపేందుకు కంపెనీపై 950 మిలియన్ డాలర్ల శిక్షాత్మక నష్ట పరిహారాన్ని జ్యూరీ విధించింది. దీంతో ఇలాంటి కేసులో ఇప్పటివరకు విధించిన అతిపెద్ద జరిమానాల్లో ఇదొకటి. అయితే, ఈ తీర్పును జాన్సన్ అండ్ జాన్సన్ విభేధిస్తోంది. ఈ నిర్ణయం అన్యాయమని, అత్యంత కఠినంగా ఇచ్చిన ఈ తీర్పుపై అప్పీలుకు వెళ్లే ఆలోచనలో ఉన్నట్టు కంపెనీ తెలిపింది.

Next Story