Raghuram Rajan: భారత్‌లో జాబ్ మార్కెట్‌కు ఊతం కావాలి: దావోస్‌లో రఘురామ్ రాజన్

by S Gopi |   ( Updated:2025-01-21 14:40:19.0  )
Raghuram Rajan: భారత్‌లో జాబ్ మార్కెట్‌కు ఊతం కావాలి: దావోస్‌లో రఘురామ్ రాజన్
X

దిశ, బిజినెస్ బ్యూరో: భారత ప్రభుత్వం మౌలిక సదుపాయాల రంగంలో మెరుగైన నిర్ణయాలు తీసుకుంటోందని, దీన్ని కొనసాగిస్తూనే దేశ జాబ్ మార్కెట్‌కు ఊతం ఇవ్వాలని , రాబోయే బడ్జెట్‌లో చర్యలు తీసుకోవాలని ఆర్‌బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ అభిప్రాయపడ్డారు. దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సమావేశంలో అమెరికా డాలర్‌పై జరిగిన సెషన్‌లో మాట్లాడిన ఆయన.. అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ. 86 స్థాయికి క్షీణించింది. అయితే, ఇది దేశీయ పరిణామాల కంటే అమెరికా కరెన్సీ బలోపేతం వల్లనే రూపాయి బలహీనత కొనసాగుతోందని చెప్పారు. ఇదే సమయంలో భారత్‌లో మౌలిక సదుపాయాల కల్పన మెరుగ్గా ఉంది. కానీ వినియోగాన్ని పెంచేందుకు కీలకమైన ఉపాధిని పెంచాలి. ప్రస్తుతం భారత వృద్ధి 6 శాతం వద్ద ఉంది, ఇది మిగిలిన దేశాలతో పోలిస్తే ఎంతో మెరుగ్గా కొనసాగుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో మరింత వేగంగా వృద్ధి నమోదవ్వాల్సిన అవసరం ఉంది. ఉద్యోగాల సృష్టి భారత్‌కు తక్షణ అవసరం. దీనికోసం జాబ్ మార్కెట్‌లో మరిన్ని ఉద్యోగాలు ఏర్పడాలి, రానున్న బడ్జెట్‌లో ఇందుకు తగిన నిర్ణయాలు, చర్యలు తీసుకోవడం సాధించవచ్చని రాజన్ వివరించారు. తద్వారా దేశంలో వినియోగం పుంజుకుని, వృద్ధి మరింత వేగంగా నమోదవుతుందని పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed