Range Rover: రూ. 75 లక్షల వరకు రేంజ్ రోవర్ ధరల తగ్గింపు

by S Gopi |

ఈ నిర్ణయం ఎఫ్‌టీఏ కింద దిగుమతి సుంకాల్లో భాగంగా తీసుకోగా, దీనివల్ల ప్రీమియం కార్ల మార్కెట్‌లో పోటీని మరింత పెంచే అవకాశం ఉంది.

Range Rover: రూ. 75 లక్షల వరకు రేంజ్ రోవర్ ధరల తగ్గింపు
X

దిశ, బిజినెస్ బ్యూరో: బ్రిటీష్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ జాగ్వార్ ల్యాండ్ రోవర్(జేఎల్ఆర్) ఇండియా తన కార్ల ధరలను భారీగా తగ్గించింది. భారత్–యూకే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం నేపథ్యంలో కంపెనీ ధరల సవరణ చేపట్టింది. యూకే నుంచి దిగుమతి చేసే రేంజ్ రోవర్ మోడళ్ల ధరలను గరిష్ఠంగా రూ. 75 లక్షల వరకు తగ్గించింది. ఈ నిర్ణయం ఎఫ్‌టీఏ కింద దిగుమతి సుంకాల్లో భాగంగా తీసుకోగా, దీనివల్ల ప్రీమియం కార్ల మార్కెట్‌లో పోటీని మరింత పెంచే అవకాశం ఉంది. కంపెనీ వివరాల ప్రకారం, ఫ్లాగ్‌షిప్ రేంజ్ రోవర్ ఎస్‌వీ ధర రూ. 4.25 కోట్ల నుంచి రూ. 3.5 కోట్లకు, దాదాపు రూ. 75 లక్షల వరకు తగ్గించింది. అలాగే రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎస్‌వీ ధరను రూ. 2.75 కోట్ల నుంచి రూ. 2.35 కోట్లకు సవరించింది. ఈ కొత్త ధరలు తక్షణం అమల్లోకి వస్తాయని కంపెనీ స్పష్టం చేసింది. అదనంగా, రేంజ్ రోవర్ ఎస్‌వీ మోడల్‌లో ప్రీమియం పెయింట్ ఫినిష్‌లు స్టాండర్డ్‌గా అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది. ఇతర మోడళ్ల ధరల్లో ఎలాంటి మార్పు లేదని, అలాగే, స్థానికంగా తయారయ్యే రేంజ్ రేఒవర్ మోడళ్ల ధరలు మారలేదని కంపెనీ పేర్కొంది.

Next Story