- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రూ. 299కే కార్పొరేట్ జియోఫై.. చిన్న వ్యాపారాల కోసం జియో కొత్త ఆఫర్
రిలయన్స్ జియో చిన్న, మధ్యతరహా వ్యాపారాల (SMEs) కోసం కొత్త ఆఫర్‌తో ముందుకొచ్చి “కార్పొరేట్ జియోఫై” పేరుతో కొత్త ప్లాన్‌ను ప్రకటించింది.

దిశ, వెబ్ డెస్క్: భారత టెలికాం వ్యవస్థలో సంచలన మార్పులకు శ్రీకారం చుట్టిన జియో (JIO) మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎంతో కాలంగా వెనుకబడిన భారతదేశంలో డిజిటల్ కనెక్టివిటీని విస్తరించడంలో ముందంజలో ఉన్న రిలయన్స్ జియో (Reliance Jio), ఇప్పుడు చిన్న, మధ్యతరహా వ్యాపారాల (SMEs) కోసం కొత్త ఆఫర్‌తో ముందుకొచ్చింది. “కార్పొరేట్ జియోఫై” పేరుతో కొత్త ప్లాన్‌ను ప్రకటించింది. ఈ ప్లాన్ నెలకు కేవలం రూ. 299 నుంచి ప్రారంభమవుతుంది. ఇందులో ప్రధాన ఆకర్షణగా జియోఫై (JioFi) పరికరం ఉచితంగా లభించడం ఉంది. అయితే ఆ పరికరం జియోదే కావడంతో వినియోగం అనంతరం తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది. ఈ పరికరాల ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న వ్యాపార సంస్థలకు చౌకగా, వేగవంతమైన ఇంటర్నెట్‌ను అందించడమే జియో లక్ష్యంగా పెట్టుకుంది.
ఓ నివేదిక ప్రకారం.. ఈ కార్పొరేట్ జియోఫై (JioFi )లో రౌటర్ M2S బ్లాక్ డివైజ్ ఉపయోగించబడింది. ఇది 2300/1800/850 MHz బ్యాండ్‌లలో 4G LTE నెట్‌వర్క్‌కు మద్దతు ఇస్తుంది. ఈ చిన్న వైఫై యూనిట్ ద్వారా 10 వైఫై పరికరాలు, 1 USB డివైజ్‌ను కనెక్ట్ చేయవచ్చు. ఇందులో ఉన్న 2300 mAh బ్యాటరీ 5–6 గంటల వరకు నిరంతర ఇంటర్నెట్ సదుపాయం అందిస్తుంది. అదనంగా మైక్రో SD స్టోరేజీ, మైక్రో-USB ఛార్జింగ్, వన్-టచ్ WPS సెటప్, ఫైల్ షేరింగ్, JioCall యాప్ సపోర్ట్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. ఇది 5G రౌటర్ కాకపోయినా, చిన్న వ్యాపారాలు, స్టార్టప్‌లు, ఫీల్డ్ ఆఫీసులకు సరిపడే పోర్టబుల్ 4G సొల్యూషన్గా జియో ఈ పరికరాన్ని ప్రతిపాదించింది. ఇది పూర్తిగా అందుబాటులోకి వస్తే.. ఇకపై చిన్న వ్యాపారాలు ఇంటర్నెట్ సమస్యను ఎదుర్కొవడం తగ్గుతుంది. అలాగే మారుమూత ప్రాంతాల్లో సైతం ఆన్ లైన్ పేమెంట్ సేవలు సులబతరంగా మారుతాయి.






