JioHotstar: జియోహాట్‌స్టార్‌లో కొత్త అడ్వర్టైజింగ్ ట్రెండ్

by S Gopi |

సులభంగా చెప్పాలంటే, యూజర్లు ఏం చూస్తున్నారనే కాదు, తర్వాత ఏం కొనాలనుకుంటున్నారో అర్థం చేసుకుని యాడ్స్ చూపించడం.

JioHotstar: జియోహాట్‌స్టార్‌లో కొత్త అడ్వర్టైజింగ్ ట్రెండ్
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జియోహాట్‌స్టార్ అడ్వర్టైజ్‌మెంట్ విభాగంలో కొత్త ట్రెండ్ తీసుకొచ్చింది. ఇప్పటివరకు యూజర్లు ఎలాంటి వీడియోలు చూస్తున్నారనే దాన్ని బట్టి యాడ్స్ కనిపించేవి. దీన్ని మరింత స్మార్ట్‌గా మారుస్తూ, జియోహాట్‌స్టార్ ఇప్పుడు 'సిగ్నల్-ఆధారిత కామర్స్ అడ్వర్టైజింగ్' విధానాన్ని ప్రవేశపెట్టింది. సులభంగా చెప్పాలంటే, యూజర్లు ఏం చూస్తున్నారనే కాదు, తర్వాత ఏం కొనాలనుకుంటున్నారో అర్థం చేసుకుని యాడ్స్ చూపించడం. అడ్వర్టైజ్‌మెంట్ పరిశ్రమలోనే ఇది మొట్టమొదటి ప్రయత్నమని కంపెనీ పేర్కొంది. ఈ విధానానికి తొలి భాగస్వామిగా ఇన్‌స్టామార్ట్ చేరింది. దీనివల్ల యూజర్లు ఫుడ్ వీడియో చూస్తున్నప్పుడు, తక్షణం ఆ ఐటెమ్ ఆర్డర్ చేసే ఆప్షన్ కనిపిస్తుంది. ఈ తరహా టెక్నాలజీ ప్రధాన లక్ష్యం, కస్టమర్లు ఏదైనా చూసి, నచ్చి, కొనడానికి చేసే ప్రయత్నాల మధ్య గ్యాప్ తగ్గించడమని కంపెనీ చెబుతోంది.

ఇప్పటివరకు, యూజర్ల వయసు, లొకేషన్ ఆధారంగా యాడ్స్ వచ్చేవి. ఇప్పుడు ఇంటెంట్(కొనాలనే ఆసక్తి) ఆధారంగా యాడ్స్ టార్గెట్ అవుతాయి. దీనివల్ల యాడ్స్ రిలవెంట్‌గా ఉండటమే కాకుండా బ్రాండ్స్‌కు ప్రయోజనాలు లభిస్తాయి. ప్రస్తుతం ఐపీఎల్ సీజన్‌తో పాటు ఈ ఫీచర్‌ను లాంచ్ చేశారు. ఈ సమయంలో కోట్లాది మంది యూజర్లు యాక్టివ్‌గా ఉండటంతో, ఎంటర్‌టైన్‌మెంట్ షాపింగ్‌తో కలిపి ఈ కొత్త ట్రెండ్‌కు జియోహాట్‌స్టార్ శ్రీకారం చుట్టింది.

Next Story