JioHotstar: జియోహాట్‌స్టార్ యూజర్లకు షాక్.. ప్లాన్‌ల ధరలు పెంపు

by S Gopi |

కొత్త ధరలు ఈ నెల 28 నుంచి అమల్లోకి వస్తాయని వెల్లడించింది.

JioHotstar: జియోహాట్‌స్టార్ యూజర్లకు షాక్.. ప్లాన్‌ల ధరలు పెంపు
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జియోహాట్‌స్టార్ యూజర్లకు షాక్ ఇచ్చింది. ముఖ్యంగా కొత్త కస్టమర్లకు సబ్‌స్క్రిప్షన్ ఫీజును భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. కొత్త ధరలు ఈ నెల 28 నుంచి అమల్లోకి వస్తాయని వెల్లడించింది. ప్రస్తుతం ప్లాట్‌ఫామ్ ప్రీమియం ప్లాన్ ఏడాదికి రూ. 1,499 ఉండగా, దీన్ని ఏకంగా రూ. 2,199కి పెంచేసింది. అంటే దాదాపు 47 శాతం పెంపు. ముఖ్యంగా, అన్ని సబ్‌స్క్రిప్షన్ విభాగాల్లో నెలవారీ ప్లాన్‌లను ప్రవేశపెట్టింది. సూపర్ ప్లాన్ విభాగంలో ధరను 22 శాతం పెంచింది. అయితే, ఇప్పటికే సబ్‌స్క్రిప్షన్ ఉన్న కస్టమర్లకు రెన్యూవల్ చేసుకున్నంత కాలం ప్రస్తుత ధరలే వర్తిస్తాయని కంపెనీ స్పష్టం చేసింది.

కొత్త ధరల వివరాలు

కొత్త సబ్‌స్క్రైబర్‌ల కోసం మొబైల్ ప్లాన్ ధర నెలకు రూ. 79, త్రైమాసికానికి రూ. 149, ఏడాదికి రూ. 499గా నిర్ణయించింది. ఈ ప్లాన్ కేవలం ఒక మొబైల్ పరికరానికి మాత్రమే యాక్సెస్ ఉంటుంది. యాడ్స్ వస్తాయి. సూపర్ ప్లాన్ ధర నెలకు రూ. 149, త్రైమాసికానికి రూ. 349, ఏడాదికి రూ. 1,099గా ఉంటుంది. ఈ ప్లాన్లు తీసుకుంటే గరిష్టంగా రెండు డివైజ్‌లలో చూసేందుకు యాక్సెస్‌ ఉంటుంది. ప్రీమియం ప్లాన్ ధర నెలకు రూ. 299, త్రైమాసికానికి రూ. 699, ఏడాదికి రూ. 2,199గా ఉంది. లైవ్ స్పోర్ట్స్, లైవ్ షోలు మినహాయించి, యాడ్స్ లేకుండా గరిష్టంగా నాలుగు డివైజ్‌లలో యాక్సెస్ ఉంటుంది.

Next Story