Jio Bharat Phone: పిల్లలు, వృద్ధుల రక్షణ కోసం జియో భారత్ ఫోన్‌లో సరికొత్త ఫీచర్లు

by S Gopi |

ఈ ఫోన్‌లో అత్యవసర కాల్ బటన్‌, లొకేషన్ షేరింగ్, బిల్ట్-ఇన్ 'సేఫ్టీ షీల్డ్' డిజైన్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

Jio Bharat Phone: పిల్లలు, వృద్ధుల రక్షణ కోసం జియో భారత్ ఫోన్‌లో సరికొత్త ఫీచర్లు
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రైవేట్ రంగ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో తన జియోభారత్ ఫోన్‌లలో సరికొత్త సేఫ్టీ ఫీచర్లను తీసుకొచ్చింది. పిల్లలు, వృద్ధ కుటుంబసభ్యుల రక్షణ కోసం సులభమైన పరిష్కారాలను అందించే లక్ష్యంతో ఈ ఫీచర్లను అందుబాటులోకి తెచ్చినట్టు కంపెనీ వెల్లడించింది. బుధవారం ప్రారంభమైన ఇండియా మొబైల్ కాంగ్రెస్-2025 కార్యక్రమంలో ఈ మేరకు కంపెనీ వివరాలను వెల్లడించింది. ఈ ఫోన్‌లో అత్యవసర కాల్ బటన్‌, లొకేషన్ షేరింగ్, బిల్ట్-ఇన్ 'సేఫ్టీ షీల్డ్' డిజైన్ వంటి ఫీచర్లు ఉన్నాయి. వీటి ద్వారా పిల్లలు, వృద్ధులు ఫోన్ వాడటంలో భద్రత మరింత మెరుగవుతుందని కంపెనీ తెలిపింది. రెండు జియోభారత్ ఫోన్‌లను కూడా ఒకదానితో ఒకటి లింక్ చేయవచ్చని జియో చెబుతోంది. కాబట్టి ఒక వ్యక్తికి సహాయం అవసరమైతే, మరొక ఫోన్‌కు క్విక్ వార్నింగ్ నోటిఫికేషన్ అందుతుంది.

దేశవ్యాప్తంగా వినియోగదారుల శ్రేయస్సు, భద్రత కోసం టెక్నాలజీని ఉపయోగించాలనే లక్ష్యంతో కొత్త ఫీచర్లు తెచ్చామని జియో పేర్కొంది. ఇందులో ముఖ్యమైన నాలుగు ఫీచర్లు ఉన్నాయి. అవి.. పిల్లలు స్కూళ్లకు వెళ్లిన సమయంలో, పెద్దలు ఇంటి నుంచి బయటకు వెళ్ళినప్పుడు ఉపయోగపడేలా 'లొకేషన్ మానిటరింగ్', నమ్మకస్తుల కాంట్రాక్టు నంబర్లను వైట్‌లిస్ట్ జాబితాలో చేర్చుకోవడం, తెలియని కాలర్లను బ్లాక్ చేయడం, కుటుంబ సభ్యుల చేతుల్లో ఎక్కువ నియంత్రణ ఉండేలా 'యూసేజ్ మేనేజర్', బ్యాటరీ, నెట్‌వర్క్ సామర్థ్యం తెలిపే 'ఫోన్ సర్వీస్ హెల్త్' ఫీచర్‌తో పాటు బ్యాటరీ బ్యాకప్ ద్వారా అత్యవసర సమయాల్లో పనిచేసేలా 'ఆల్వేస్ అవైలబుల్' ఫీచర్‌ను కూడా జియో ఇందులో అందిస్తోంది.

Next Story