Jio Payments Bank: జియో పేమెంట్స్ బ్యాంక్ యూపీఐ ఆధారిత విత్‌డ్రా సేవలు

by S Gopi |

కంపెనీకి చెందిన బిజినెస్ కరస్పాండెంట్ టచ్‌పాయింట్ల ద్వారా యూపీఐ ఆధారిత నగదు విత్‌డ్రాను ప్రవేశపెట్టింది.

Jio Payments Bank: జియో పేమెంట్స్ బ్యాంక్ యూపీఐ ఆధారిత విత్‌డ్రా సేవలు
X

దిశ, బిజినెస్ బ్యూరో: జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ పూర్తి అనుబంధ సంస్థ జియో పేమెంట్స్ బ్యాంక్ సరికొత్త యూపీఐ ఆధారిత విత్‌డ్రా సేవలను అందుబాటులోకి తెచ్చింది. కంపెనీకి చెందిన బిజినెస్ కరస్పాండెంట్ టచ్‌పాయింట్ల ద్వారా యూపీఐ ఆధారిత నగదు విత్‌డ్రాను ప్రవేశపెట్టింది. ఈ సేవల ద్వారా దేశంలో డిజిటల్ చెల్లింపుల వ్యవస్థను బలోపేతం చేయడానికి, ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్‌ను ముందుకు తీసుకెళ్లడానికి కీలకమైన ముందడుగు అని కంపెనీ అభిప్రాయపడింది. ఈ యూపీఐ ఆధారిత విత్‌డ్రా సేవలను డెబిట్ కార్డు, ఏటీఎంతో అవసరం లేకుండా విత్‌డ్రా చేసుకోవచ్చు. ముఖ్యంగా ఈ సేవలు గ్రామీణ, మోస్తరు పట్టణ ప్రాంతాల్లో ఉండే కస్టమర్లు తమ యూపీఐ యాప్ నుంచి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి, సొమ్ము విత్‌డ్రా చేసుకోవచ్చని జియో పేమెంట్స్ బ్యాంకు వెల్లడించింది.

Next Story