- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Jio Platforms: 'ట్రస్టెడ్ టెక్ అలయన్స్'ను ప్రారంభించిన గ్లోబల్ టెక్ దిగ్గజాలు
ఈ కంపెనీలు టెక్నాలజీని సురక్షితంగా, విశ్వసనీయంగా, నమ్మదగినదిగా మార్చడానికి కలిసి పనిచేయనున్నాయి.

దిశ, బిజినెస్ బ్యూరో: జియో ప్లాట్‌ఫామ్స్, ఆంథ్రోపిక్‌లతో సహా గ్లోబల్ టెక్ కంపెనీలు కలిసి ట్రస్టెడ్ టెక్ అలయన్స్ (టీటీఏ)ను ఏర్పాటు చేశాయి. ఈ కూటమిలో ఆఫ్రికా, ఆసియా, యూరప్, ఉత్తర అమెరికా నుంచి 15 కంపెనీలు ఉన్నాయి. ఈ కంపెనీలు టెక్నాలజీని సురక్షితంగా, విశ్వసనీయంగా, నమ్మదగినదిగా మార్చడానికి కలిసి పనిచేయనున్నాయి. ఇంటర్నెట్ కనెక్టివిటీ, క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ నుంచి సెమీకండక్టర్లు, సాఫ్ట్‌వేర్, ఏఐ వరకు టెక్నాలజీకి సంబంధించి అన్ని విభాగాలపై దృష్టి సారిస్తాయి. ఈ అలయన్స్ లక్ష్యం పారదర్శకత, భద్రత, డేటా రక్షణ అనే ఉమ్మడి సూత్రాలను అనుసరిస్తాయి. దీని అర్థం ఒక కంపెనీ ఏ దేశం నుంచి వచ్చినా, అది బాధ్యతాయుతంగా పనిచేస్తుంది. ప్రభుత్వాలు, వ్యాపారాలు, ప్రజల్లో నమ్మకాన్ని పెంచుతాయి.
డిజిటల్ టూల్స్ కారణంగా ఎదురయ్యే ప్రతికూల ప్రభావాల గురించి ఆందోళనలను పరిష్కరించే సమయంలో దేశాలు, కస్టమర్‌లు నమ్మకమైన టెక్నాలజీని పొందడంలో ఈ కూటమి సహాయపడతాయి. కలిసి పనిచేయడం ద్వారా, టెక్నాలజీని సురక్షితంగా ఉంచాలని, ఉద్యోగాలను సృష్టించాలని, ఆర్థిక వృద్ధికి మద్దతు ఇవ్వాలని, ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ సాధనాలకు యాక్సెస్ లభించే చర్యలను టీటీఏ ఆశిస్తోంది. ఈ సందర్భంగా మాట్లాడిన జియో ప్లాట్‌ఫామ్స్ సీఈఏ కిరణ్ థామస్.. ఈ అలయన్స్ డిజిటల్ అవకాశాలను మెరుగుపరుస్తుందని, తదుపరి తరం కనెక్టివిటీ, క్లౌడ్, ఏఐ వ్యవస్థలపై విశ్వాసాన్ని పెంపొందిస్తుందని అన్నారు. ఈ అలయన్స్‌లో ప్రస్తుతం ఆంథ్రోపిక్, ఏడబ్ల్యూఎస్, కాసావా టెక్నాలజీస్, కోహెర్, ఎరిక్సన్, గూగుల్ క్లౌడ్, హన్వా, జియో ప్లాట్‌ఫామ్స్, మైక్రోసాఫ్ట్, నోకియా, ఎన్‌స్కేల్, ఎన్‌టీటీ, రాపిడస్, సాబ్, శాప్ సంస్థలు ఉన్నాయి.






