- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సంపన్న వ్యక్తుల జాబితాలో తన స్థానాన్ని కోల్పోయిన జెఫ్ బెజోస్
2025 జూన్‌లో ప్రపంచ సంపన్నుల జాబితా అయిన ఫోర్బ్స్ వరల్డ్ బిలియనీర్ల లిస్టులో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి.

దిశ, వెబ్ డెస్క్: 2025 జూన్‌లో ప్రపంచ సంపన్నుల జాబితాను ఫోర్బ్స్ తాజాగా విడుదల చేసింది. ఈ లిస్టులో అమెజాన్ (Amazon) వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ (Jeff Bezos) తన రెండో స్థానాన్ని కోల్పోయారు. ఆయన స్థానాన్ని ప్రముఖ టెక్నాలజీ దిగ్గజ సంస్థ ఒరాకిల్ (Oracle) కోఫౌండర్ లారీ ఎల్లిసన్ (Larry Ellison) దక్కించుకున్నారు. నిజానికి 4వ స్థానంలో ఉండాల్సిన ఎల్లిసన్ ఒకే రోజులో ఆయన సంపదను 26 బిలియన్ డాలర్లు పెంచుకుని.. జెఫ్ బెజోస్, మార్క్ జుకర్‌బర్గ్ (Mark Zuckerberg)లను వెనక్కు నెట్టి రెండో స్థానంలో నిలిచారు. లారీ ఎల్లిసన్ సంపద ప్రస్తుతం సుమారు 243 బిలియన్ డాలర్లుగా ఉంది.
కాగా, లారీ ఎల్లిసన్ 1977లో ఒరాకిల్ సంస్థను స్థాపించారు. గత రెండు దశాబ్దాలుగా ఈ కంపెనీ భారీగా అభివృద్ధి చెందుతూ క్లౌడ్ కంప్యూటింగ్, డేటాబేస్ టెక్నాలజీ రంగాల్లో ప్రముఖ స్థానాన్ని సొంతం చేసుకుంది. ఇటీవల ఒరాకిల్ షేర్ల విలువ భారీగా పెరిగిన నేపథ్యంలో ఎల్లిసన్ సంపద కూడా పెరిగి రెండో స్థానానికి చేరింది.
ఇక టెస్లా, స్పేస్‌ఎక్స్ వంటి కంపెనీల అధినేత ఎలాన్ మస్క్ మొదటి స్థానాన్ని కొనసాగిస్తున్నారు. ఆయన సంపద సుమారు 407 మిలియన్ డాలర్లకు పైగా ఉంది. బెజోస్ సంపద మాత్రం ఈ మధ్య కాలంలో అమెజాన్ షేర్ల విలువ తగ్గడంతో స్వల్పంగా పడిపోయింది. ఈ మార్పులతో ప్రపంచ ధనవంతుల పోటీ మరింత ఆసక్తికరంగా మారింది. టెక్ రంగంలో విజయం, కంపెనీల మార్కెట్ విలువలే ఈ స్థాయిని నిర్ణయిస్తున్నట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఫోర్బ్స్ లెక్కల ప్రకారం, ప్రపంచంలోని అత్యంత ధనవంతుల స్థానం రోజురోజుకీ షేర్ మార్కెట్ మార్పులపై ఆధారపడుతోంది.






