బిస్లరీ పగ్గాలు జయంతి చేతికే!

by Disha Web Desk 13 |
బిస్లరీ పగ్గాలు జయంతి చేతికే!
X

ముంబై: ప్రముఖ ప్యాకేజ్డ్‌ వాటర్‌ వ్యాపార సంస్థ బిస్లరీ బాధ్యతలను ఇంటర్నేషనల్ ఛైర్మన్ రమేష్ చౌహాన్ కుమార్తె జయంతి చౌహాన్ చేపట్టనున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె సంస్థ వైస్-ఛైర్‌పర్శన్‌గా ఉన్నారు. 'జయంతి సంస్థలోని బృందంతో కలిసి పని చేయనున్నారు. అందుకే తమ వ్యాపారాన్ని విక్రయించాలని అనుకోవట్లేదని' రమేష్ చౌహాన్ ఓ ప్రకటనలో తెలిపారు. గత నవంబర్‌లో బిస్లరీ బ్రాండ్‌ను విక్రయించేందుకు టాటా గ్రూపునకు చెందిన టాటా కన్స్యూమర్ ప్రోడక్ట్స్(టీసీపీఎల్)తో చర్చలు జరిపారు. మెజారిటీ వాటా కోసం రూ. 6000-7000 వేల కోట్లకు ఒప్పందం పూర్తవుతుందని అంతా భావించారు.

అయితే, గతవారం టీసీపీఎల్ తాము కొనుగోలుకు సంబంధించి చర్చలు నిలిపేశామని, దీనిపై ఎలాంటి ఖచ్చితమైన ఒప్పందం చేసుకోలేదని వెల్లడించింది. ఈ క్రమంలోనే బిస్లరీఎ కంపెనీ తాజా వ్యాఖ్యలు చేసింది. జయంతి చౌహాన్ కొన్నేళ్లుగా కంపెనీ వ్యాపారంలో కొనసాగుతున్నారు. కొంత ఆలస్యంగానైనా ఆమె బిస్లరీ బ్రాండ్‌ను విస్తరించే పనిలో ఉన్నారని సమాచారం. కాగా, బిస్లరీ బ్రాండ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డేటా ప్రకారం రూ. 200 కోట్ల వార్షిక టర్నోవర్‌ను కలిగి ఉంది. ఒకవేళ టాటాతో ఒప్పందం జరిగి ఉంటే టీసీపీఎల్ దేశంలోనే అతిపెద్ద ఎఫ్ఎంసీజీ కంపెనీగా మారేది. ఇక, 2020, ఏప్రిల్‌లో హిందూస్తాన్ యూనిలీవర్ రూ. 3,045 కోట్లకు హార్లిక్స్ బ్రాండ్ కొనుగోలే ఈ విభాగంలో అతిపెద్ద ఒప్పందం ఉంది.


Next Story

Most Viewed