- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Honda-Nissan Merger: విలీన ప్రక్రియను నిలిపేస్తున్నట్టు ప్రకటించిన నిస్సాన్, హోండా
విలీనంపై ముందుకెళ్లకూడదని కంపెనీల బోర్డు నిర్ణయించాయని సంయుక్త ప్రకటనలో స్పష్టం చేశాయి.

దిశ, బిజినెస్ బ్యూరో: జపాన్ వాహన తయారీ కంపెనీలు హోండా, నిస్సాన్, మిత్సుబిషిల విలీనానికి సంబంధించిన చర్చలను విరమించుకున్నాయి. ఈ మేరకు గురువారం ప్రకటన విడుదల చేశాయి. విలీనంపై ముందుకెళ్లకూడదని కంపెనీల బోర్డు నిర్ణయించాయని సంయుక్త ప్రకటనలో స్పష్టం చేశాయి. అంతర్జాతీయ వాహన పరిశ్రమలో పెరిగిన పోటీ కారణంగా హోండా మోటార్ కంపెనీ, నిస్సాన్ మోటార్ కార్పోరేషన్‌లు కలిసి జాయింట్ హోల్డింగ్ కంపెనీని స్థాపించడానికి చర్చలు జరుపుతున్నట్టు డిసెంబర్‌లో ప్రకటించాయి. ఆ తర్వాత మిత్సుబిషి మోటార్స్ కార్పొరేషన్ కూడా ఆ గ్రూప్‌లో చేరే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపింది. దీనివల్ల టయోటా, ఫోక్స్‌వ్యాగన్ కంపెనీల తర్వాత అతిపెద్ద కంపెనీ అవుతుందని అందరూ భావించారు. అయితే, తాజా నిర్ణయంతో ప్రపంచంలోనే మూడో అతిపెద్ద కార్ల తయారీ సంస్థ అవతరిస్తుందనే సంకేతాలకు బ్రేకులు పడ్డాయి. టెస్లా, బీవైడీ లాంటి ఈవీ కంపెనీల రాక, ఎలక్ట్రిక్ కార్లకు మారే క్రమంలో మొదటి నుంచి కంపెనీల మధ్య చరలు అనుకున్న స్థాయిలో ముందుకెళ్లలేదు.






