- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Jack Dorsey: ఇంటర్నెట్ అవసరంలేని మెసేజింగ్ యాప్ ప్రారంభించిన మాజీ ట్విట్టర్ సీఈఓ జాక్ డోర్సే
ఈ బిట్‌చాట్ బ్లూటూత్-లో-ఎనర్జీ(బీఎల్ఈ) మెష్ నెట్‌వర్క్‌ల ద్వారా పీర్-టూ-పీర్ మెసేజింగ్ సదుపాయాన్ని అందిస్తుంది.

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ టెక్ వ్యవస్థాపకుడు, మాజీ ట్విట్టర్ సీఈఓ జాక్ డోర్సే సరికొత్త మెసేజింగ్ యాప్‌ను ప్రకటించారు. దీనికి ఇంటర్నెట్ అవసరం లేదని, వ్యక్తిగత సమాచారం కూడా లేకుండా పనిచేసేలా 'బిట్‌చాట్' అనే డీసెంట్రలైజ్‌డ్ మెసేజింగ్ అప్లికేషన్‌ను ప్రారంభించారు. ఈ బిట్‌చాట్ బ్లూటూత్-లో-ఎనర్జీ(బీఎల్ఈ) మెష్ నెట్‌వర్క్‌ల ద్వారా పీర్-టూ-పీర్ మెసేజింగ్ సదుపాయాన్ని అందిస్తుంది. సాధారణ సెల్యూలార్ నెట్‌వర్క్ లేదా వైఫై కనెక్టివిటీ లేని సమయాల్లో యూజర్లు 300 మీటర్ల కంటే ఎక్కువ పరిధిలో ఉండి కమ్యూనికేట్ చేసుకునేందుకు ఇది వీలు కల్పిస్తుంది. ఈ యాప్ ప్రస్తుతం యాపిల్ టెస్ట్‌ఫ్లైట్ ద్వారా బీటా వెర్షన్‌లో మాత్రమే అందుబాటులో ఉందని జాక్ డొర్సే తెలిపారు.
గిట్‌హబ్‌లో ప్రచురించబడిన వైట్‌పేపర్ ప్రకారం, బిట్‌చాట్ డైరెక్ట్ డివైస్-టు-డివైస్ మెసేజింగ్‌ను అనుమతిస్తుంది. అంటే ప్రతీ ఫోన్ సెండర్‌గానూ, రిసీవర్‌గా కూడా రెండు రకాలుగానూ పనిచేస్తుంది. ఈ సిస్టమ్ మల్టీ-హాప్ మెసేజ్ ట్రాన్స్‌ఫర్‌గా అంటే ఒక మెసేజ్ చేరాల్సిన చోటుకు వెళ్లేందుకు సమీపంలోని వివిధ పరికరాల ద్వారా ప్రయాణిస్తుంది. ముఖ్యంగా, ఈ రకమైన యాప్ పనిచేయడానికి ఫోన్ నంబర్, ఇ-మెయిల్ లేదా మరే రకమైన అకౌంట్ అవసరం లేదు. ఇది, దాని డీసెంట్రలైజ్‌డ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లతో పెయిర్ అవుతుంది. ఇది సర్వర్లు లేదా సెంట్రల్ కంట్రోల్ లేకుండా ఉంటుంది. మెసేజ్‌లు డివైజ్ మెమరీలో తాత్కాలికంగా నిల్వ అవుతాయి. గ్రహీతకు ఆ మెసేజ్ తాత్కాలికంగా చేరుకోలేకపోతే ఆటోమేటిక్ కాచింగ్(టెంపరరీ స్టోరేజ్) స్థానంలో ఉంటుంది. గ్రహీత మెష్ నెట్‌వర్క్‌కు తిరిగి కనెక్ట్ అయినప్పుడు మెసేజ్‌లు డెలివరీ అవుతాయి.






