ఆర్థిక ఫలితాలను ప్రకటించిన IT కంపెనీ సొనాటా

by Disha Web Desk 17 |
ఆర్థిక ఫలితాలను ప్రకటించిన IT కంపెనీ సొనాటా
X

బెంగళూరు: IT కంపెనీ సొనాటా సాఫ్ట్‌వేర్ లిమిటెడ్ తన ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. జనవరి- మార్చి 2023 త్రైమాసికానికి సంబంధించి ఏకీకృత ఆదాయాన్ని రూ.1,913.5 కోట్లుగా నివేదించింది. ఇది గత ఆర్థిక సంవత్సరం మూడవ త్రైమాసికంలో రూ. 2,260.8 కోట్లుగా ఉంది. క్వార్టర్-టు-క్వార్టర్ ప్రాతిపదికన నికర లాభం 3.3 శాతం తగ్గి రూ.113.8 కోట్లకు చేరుకుంది. ఇది అంతకుముందు రూ. 117.7 కోట్లుగా ఉంది. మార్చి 31, 2023 తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో కంపెనీ మొత్తం ఆదాయం రూ.7519.94 కోట్లుగా నివేదించింది. ఇది గత మార్చి 31, 2022తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో రూ. 5655.35 కోట్లుగా నమోదైంది.

ఇవి కూడా చదవండి:

చిన్న పెట్టుబడిదారుల రక్షణ కోసం సెబీ కొత్త ప్రతిపాదన


Next Story

Most Viewed