- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
China's economy: చైనా ఆర్థిక వ్యవస్థ దివాలా తీస్తుందా.. డ్రాగన్ సంక్షోభంలో కూరుకుపోతోందా.. ఈ దేశ వృద్ధిరేటు ఏం చెబుతోంది..!!
China's economy: గడచిన 20 సంవత్సరాలుగా చైనా అమెరికాతో పోటీ పడుతూ ఆర్థికంగా ముందు అడుగు వేస్తూ దూసుకెళ్తోంది.

దిశ, వెబ్ డెస్క్: China's economy: గడచిన 20 సంవత్సరాలుగా చైనా అమెరికాతో పోటీ పడుతూ ఆర్థికంగా ముందు అడుగు వేస్తూ దూసుకెళ్తోంది. అయితే చైనా ప్రపంచానికి ఒక తయారీ కర్మాగారం గా పేరు సంపాదించుకుంది కంపెనీలు అన్నీ కూడా తమ తయారు యూనిట్లను చైనా నుంచే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాయి చైనా అనేది ఒక గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా మారిపోయింది.
ఫలితంగా అక్కడ యువతకు ఉపాధి అవకాశాలు పెరిగి ఆ దేశం సూపర్ పవర్ అనే స్థాయికి చేరుకుంది. అయితే చైనా పీఠం ఇప్పుడు కదిలేందుకు సిద్ధమవుతుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది ఇంతకాలం అగ్రరాజ్యంగా పేరు సంపాదించుకున్న చైనా నెమ్మది నెమ్మదిగా సంక్షోభంలోకి కూరుకుపోతోందని అక్కడి ఆర్థిక వ్యవస్థ మందగమనంలోకి ప్రవేశిస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
దీనికి ప్రధాన కారణం చైనా జిడిపి వృద్ధిరేటు భారీగా తగ్గడమే అని చెప్పవచ్చు 2024లో చైనా అధికంగా ప్రవేశపెట్టిన చైనా వృద్ధిరేటు ప్రకారం 5.5% వృద్ధిని సంపాదించుకున్నట్లు తెలుస్తోంది. అయితే అదే సమయంలో పలు విదేశీ రేటింగ్ ఏజెన్సీలు మాత్రం చైనా వృద్ధిరేటు మూడు శాతం లోపే ఉందని తేల్చుతున్నారు దీంతో చైనా గణాంకాల పైన సర్వత్రా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. నిజానికి కోవిడ్ అనంతరం చైనా వృద్ధిరేటు మందగమనం బాట పట్టింది గత ఐదు సంవత్సరాల్లో చైనా తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంది.
2025 వ సంవత్సరంలో పారిశ్రామిక ఉత్పత్తిలో కూడా చైనా వెనకడుగు వేసిందని చెప్పవచ్చు గత నెల ఏప్రిల్ లో చైనా పారిశ్రామిక ఉత్పత్తి సుమారు 6% పెరిగినప్పటికీ అమ్మకాలు మార్కెట్లో అమ్మకాలు మాత్రం 5.1% మాత్రమే పెరిగినట్లు గమనించవచ్చు దీనికి తోడు రియల్ ఎస్టేట్ రంగంలో కూడా అక్కడ పెద్ద ఎత్తున సంక్షోభం నెలకొని ఉంది అక్కడి ఎవర్ గ్రాండే అనే రియల్ ఎస్టేట్ సంస్థ పెద్ద ఎత్తున నష్టపోయింది దాదాపు దివాలా తీసింది.
చైనా ప్రస్తుతం అమెరికాతో పెట్టుకున్నటువంటి వాణిజయుద్ధం కారణంగా కూడా అక్కడి ఉత్పత్తులు కొనుగోలు చేసేందుకు అమెరికా వాణిజ్య సంస్థలు భయపడే స్థాయికి చేరుకున్నాయి. ప్రస్తుతం ఆపిల్ వంటి సంస్థలు కూడా చైనా నుంచి తమ ఐఫోన్ తయారీ యూనిట్లను వియత్నాం అలాగే భారత తరలిస్తున్నాయి.
ఇదిలా ఉంటే భారతదేశం మాత్రం స్థిరంగా అభివృద్ధి చెందుతుందని ప్రపంచ స్థాయిలో రేటింగ్ ఏజెన్సీలు చెబుతున్నాయి ముఖ్యంగా భారత్ అభివృద్ధి వెనుక కారణం ప్రభుత్వం తీసుకునే స్థిరమైన నిర్ణయాలేనని నిపుణులు పేర్కొంటున్నారు. ఇటీవల పాకిస్తాన్ పైన ఆపరేషన్ సింధూర్ సందర్భంగా భారత్ ఇచ్చిన జవాబుకు అటు మార్కెట్లు పాజిటివ్ గా స్పందిస్తున్నాయి.






