- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
IRDAI: 'బీమా సుగమ్' పోర్టల్‌ను ప్రారంభించిన ఐఆర్‌డీఏఐ
బీమా కంపెనీలు అందించే అన్ని పాలసీలను ఒక దగ్గరే చెక్ చేసుకుని, ఏది సరసమైన ధరకు లభిస్తుందో దాన్ని ఎంచుకునే వీలుంటుంది.

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ బీమా నియంత్రణ సంస్థ ఐఆర్‌డీఏఐ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'బీమా సుగమ్' పోర్టల్‌ను ప్రారంభించినట్టు బుధవారం అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతానికి ఇది పూర్తిగా అందుబాటులోకి రానప్పటికీ, ఈ సంవత్సరం డిసెంబర్‌లో ప్లాట్‌ఫామ్ మొదటి దశ లైవ్‌లోకి వస్తుందని సమాచారం. ఈ పోర్టల్ అందుబాటులోకి వస్తే అన్ని రకాల బీమా పాలసీలు ఒకే ప్లాట్‌ఫామ్‌లో లభిస్తాయి. వివిధ బీమా కంపెనీలు అందించే అన్ని పాలసీలను ఒక దగ్గరే చెక్ చేసుకుని, ఏది సరసమైన ధరకు లభిస్తుందో దాన్ని ఎంచుకునే వీలుంటుంది. ఈ ప్లాట్‌ఫామ్‌లో లభించే ఫీచర్లను దశల వారీగా అందుబాటులోకి తీసుకురానున్నారు. రానున్న రోజుల్లో ఐఆర్‌డీఏఐ బోర్డు ఆమోదించిన దానికి అనుగుణంగా ఇన్సూరెన్స్ కంపెనీలు, ఇతర భాగస్వామ్య సమ్ష్తలు బీమా సుగమ్‌లో పాలసీలను అందుబాటులోకి తీసుకురానున్నాయి.
ముఖ్యంగా ఈ ప్లాట్‌ఫామ్‌లో కస్టమర్లు, ఇన్సూరెన్స్ కంపెనీలు, ఇన్సూరెన్స్ ఏజెంట్లు, మధ్యవర్తులు అందరికీ అవసరమైన అన్ని రకాల బీమా సేవలు లభిస్తాయి. జనరల్ ఇన్సూరెన్స్ కౌన్సిల్, లైఫ్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో నడిచే ఈ పోర్టల్ బీమా రంగంలో పారదర్శకత, సమగ్రతను పెంచేందుకు ఉపయోగపడుతుంది. ఈ ప్లాట్‌ఫామ్ నుంచి పాలసీ కావాలనుకునే వారు సులభంగా కొనుగోలు చేయవచ్చు. అంతేకాకుండా పాలసీ రెన్యూవల్, క్లెయిమ్ సెటిల్‌మెంట్ వంటి పనులను సులభంగా పూర్తి చేయవచు.






