- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Economy: ఇరాన్ యుద్ధం వల్ల భారత జీడీపీ 1 శాతం తగ్గే ఛాన్స్
2026-27 ఆర్థిక సంవత్సరంలోనూ ఉద్రిక్తతలు కొనసాగితే దేశ జీడీపీ వృద్ధి రేటు సుమారు 1 శాతం వరకు క్షీణించవచ్చని అభిప్రాయపడింది.

దిశ, బిజినెస్ బ్యూరో: పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం కారణంగా భారత ఆర్థికవ్యవస్థ ప్రభావితం అయ్యే అవకాశాలు ఉన్నాయని ప్రముఖ ఎర్నెస్ట్ అండ్ యంగ్(ఈవై) తన నివేదిక తెలిపింది. 2026-27 ఆర్థిక సంవత్సరంలోనూ ఉద్రిక్తతలు కొనసాగితే దేశ జీడీపీ వృద్ధి రేటు సుమారు 1 శాతం వరకు క్షీణించవచ్చని అభిప్రాయపడింది. అదే సమయంలో దేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం ప్రాథమిక అంచనాల కంటే దాదాపు 1.5 శాతం పెరగవచ్చని పేర్కొంది. ముఖ్యంగా టెక్స్‌టైల్స్, పెయింట్లు, రసాయనాలు, ఎరువులు, సిమెంట్, టైర్ల వంటి ఉపాధి కల్పన అధికంగా ఉన్న రంగాలతో సహా అనేక రంగాలు నేరుగా ప్రభావితం కావచ్చని నివేదిక తెలిపింది. ఈ రంగాలలో ఉపాధి లేదా ఆదాయాలు తగ్గితే, అది మొత్తం డిమాండ్‌ను మరింతగా దెబ్బతీస్తుంది. మరోవైపు, ప్రపంచ చమురు మార్కెట్ అస్థిరతల వల్ల సరఫరా, డిమాండ్ పరిస్థితులు ఇప్పటికే ప్రతికూలంగా ప్రభావితం అవుతున్నాయి. ఇది ఇలాగే కొనసాగితే అన్ని రంగాల్లో రికవరీకి చాలా సమయం పడుతుందని నివేదిక వెల్లడించింది.






