ఇజ్రాయెల్-ఇరాన్ వార్ ఎఫెక్ట్.. భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఏకంగా 200శాతం..

by Sujitha Rachapalli |   (  Updated:2025-06-18 17:29:42  IST  )

ఇజ్రాయెల్- ఇరాన్ వార్ ఎఫెక్ట్‌తో వెండి ధరలు భారీగా పెరిగాయి. ప్రస్తుతం కిలోగ్రాము వెండి ధర రూ. 1,09,000 ఉండగా.. పదేళ్లలో దాదాపు 200 శాతం వృద్ధి ఉన్నట్లు విశ్లేషకులు చెప్తున్నారు.

ఇజ్రాయెల్-ఇరాన్ వార్ ఎఫెక్ట్.. భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఏకంగా 200శాతం..
X

దిశ, వెబ్‌డెస్క్ : ఇజ్రాయెల్- ఇరాన్ వార్ ఎఫెక్ట్‌తో వెండి ధరలు భారీగా పెరిగాయి. మంగళవారం రూ. 1, 07, 425 ఉన్న కిలోగ్రాము వెండి ధర రూ. 1,09,000 చేరింది. దీంతో ఈ పదేళ్లలో దాదాపు 200 శాతం వృద్ధి ఉన్నట్లు విశ్లేషకులు చెప్తున్నారు. 2015లో వెండి కిలో ధర రూ. 37 వేలు ఉండగా.. 2025 వరకు దాదాపు 72వేలు పెరిగి.. ప్రస్తుతం లక్షా తొమ్మిది వేలకు చేరింది. అయితే ఈ నెలలో ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం వల్ల సేఫ్ హెవెన్ డిమాండ్ కారణంగా ఈ పెరుగుదల గరిష్ట స్థాయికి చేరింది. అయితే ఇండస్ట్రీ డిమాండ్, పెట్టుబడి ధోరణులు కూడా దీర్ఘకాలిక వృద్ధికి కారణం. కాగా వెండి కొనుగోళ్లు, పెట్టుబడులు మంచిదని సూచిస్తున్నారు నిపుణులు. ఇక అదే సమయంలో బంగారం ఏకంగా 285శాతం వృద్ధిని సూచిస్తుంది. 2015లో రూ. 26వేలు ఉన్న పది గ్రాముల బంగారం ధర.. ప్రస్తుతం రూ. 1,01, 500కు చేరడం విశేషం.

Next Story