IPOs: దేశీయ స్టాక్ మార్కెట్లో వచ్చేవారం 5 ఐపీఓల సందడి.. స్విగ్గీ పబ్లిక్ ఇష్యూపైనే ఎక్కువ ఫోకస్..!

by Maddikunta Saikiran |
IPOs: దేశీయ స్టాక్ మార్కెట్లో వచ్చేవారం 5 ఐపీఓల సందడి.. స్విగ్గీ పబ్లిక్ ఇష్యూపైనే ఎక్కువ ఫోకస్..!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ స్టాక్ మార్కెట్లు(Stock Markets) కొన్ని రోజులు నుంచి నష్టాల్లో కొనసాగుతున్న పబ్లిక్ ఇష్యూలోకి వచ్చేందుకు కంపెనీలు లైన్ కడుతున్నాయి. కాగా వచ్చే వారం కూడా 5 కంపనీలు స్టాక్ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యాయి. వీటిలో స్విగ్గీ(Swiggy)తో పాటు మరో నాలుగు మెయిన్ బోర్డు కంపెనీల ఐపీఓలు ఉన్నాయి. వీటి సబ్ స్క్రిప్షన్ వచ్చే వారం ప్రారంభం కానున్నాయి. అలాగే ఇప్పటికే సబ్ స్క్రిప్షన్ పూర్తి చేసుకున్న ఆఫ్కాన్స్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్(Afcons Infrastructure Ltd) ఐపీఓ వచ్చేవారం స్టాక్ ఎక్స్ఛేంజీల్లో లిస్టింగ్ కానుంది. ఇవేగాక త్వరలోనే మరో 26 కంపెనీలు రూ. 72 వేల కోట్లు సమీకరించేందుకు సిద్ధమవుతున్నాయి. వచ్చేవారం ఏయే ఐపీఓలు స్టాక్ మార్కెట్లోకి రాబోతున్నాయో ఇప్పుడు చూద్దాం..

స్విగ్గీ ఐపీఓ..

ప్రముఖ ఆన్‌లైన్‌ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ(Swiggy) ఐపీఓ ద్వారా రూ. 11,300 కోట్ల సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకు సంబంధించిన సబ్‌స్క్రిప్షన్‌(Subscription) నవంబర్ నవంబర్ 6 నుంచి 8 వరకు కొనసాగనుంది. ఇక ఒక్కో ఈక్విటీ షేర్ ధరను రూ. 371- రూ. 390గా కంపెనీ ఖరారు చేసింది. ఇందులో షేర్ల విక్రయం ద్వారా రూ. 4500 కోట్లు, ఆఫర్ ఫర్ సేల్ కింద రూ. 6800 కోట్లను సమీకరించనున్నారు. ఐపీఓ ద్వారా వచ్చే ఆదాయాన్ని అనుబంధ సంస్థలు, క్లౌడ్ ఇన్ ఫ్రా స్ట్రక్చర్ కోసం, బ్రాండ్ మార్కెటింగ్ కోసం ఉపయోగించనుంది. ఈ ఇయర్ రాబోతున్న అతిపెద్ద ఐపీఓల్లో స్విగ్గీ కూడా ఒకటి కావడం విశేషం.

సగిలిటీ ఇండియా ఐపీఓ..

ఆరోగ్య సేవల కంపెనీ సగిలిటీ ఇండియా ఐపీఓ ద్వారా రూ. 2,107 కోట్లను సమీకరించనుంది. నవంబర్ 5న సబ్ స్క్రిప్షన్ ప్రారంభమై 7న ముగుస్తుంది. ఒక్కో షేరుకు రూ. 28-30 గా నిర్ణయించింది. పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ కింద షేర్లను విక్రయించనుంది. కాగా ఐపీఓ ద్వారా కంపెనీకి ఎలాంటి ఆదాయం రాదు. మొత్తం షేర్ హోల్డర్ కే వెళ్లనుంది.

నివ బూప హెల్త్ ఇన్సూరెన్స్ ఐపీఓ..

హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ నివ బూప హెల్త్ కేర్ రూ. 2,200 కోట్ల ఐపీఓ నవంబర్ 7 నుంచి 11 వరకు అందుబాటులో ఉంటుంది. ఇందులో తాజా ఈక్విటీ షేర్ల ద్వారా రూ. 800 కోట్లను, ఆఫర్ ఫర్ సేల్ కింద రూ. 1400 కోట్లను సమీకరించనుంది. షేర్ల ధరను ఇంకా ప్రకటించాల్సి ఉంది.

నీలం లైన్స్ అండ్ గార్మెంట్స్ ఐపీఓ..

ఇక ఎస్ఎంఈ సెగ్మెంట్ కు చెందిన నీలం లైన్స్ అండ్ గార్మెంట్స్ ఐపీఓ నవంబర్ 8 నుంచి 12 వరకు అందుబాటులో ఉంటుంది. ఐపీఓ ద్వారా ఆ సంస్థ రూ. 13 కోట్లు సమీకరించనుంది. ఒక్కో షేరుకు రూ. 20 - రూ. 24 గా సంస్థ ఖరారు చేసింది.

సోలార్ హోల్డింగ్స్ ఐపీఓ..

సోలార్ హోల్డింగ్స్ ఐపీఓ నవంబర్ 5న ప్రారంభమై 8న ముగుస్తుంది. ఒక్కో ఈక్విటీ షేర్ రూ. 275-389 గా ఉంది. ఐపీఓ ద్వారా రూ. 2,900 కోట్లు సమీకరించనున్నట్లు కంపెనీ తెలిపింది.

Advertisement

Next Story