- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
IPOs: స్టాక్ మార్కెట్లో వచ్చేవారం వచ్చే వారం 11 ఐపీఓల సందడి..!
దేశీయ స్టాక్ మార్కెట్ల(Stock Markets)లో వచ్చే వారం ఐపీఓల వరద పారనుంది.

దిశ,వెబ్‌డెస్క్: దేశీయ స్టాక్ మార్కెట్ల(Stock Markets)లో వచ్చే వారం ఐపీఓల వరద పారనుంది. డిసెంబర్ రెండో వారంలో కొత్తగా 11 కంపెనీలు సబ్ స్క్రిప్షన్(Subscription)కు రానున్నాయి. అయితే ఇందులో 5 కంపెనీలు మెయిన్ బోర్డు(Main Board) విభాగం నుంచి వస్తుండగా.. ఎస్ఎంఈ సెగ్మెంట్(SME Segment) నుంచి 6 కంపెనీలు ఉన్నాయి. ఈ 11 కంపెనీలు కలిపి ఐపీఓ ద్వారా రూ. 18,500 కోట్లను సమీకరించనున్నాయి. ఇందులో అత్యధికంగా విశాల్ మెగా మార్ట్(Vishal Mega Mart) రూ. 8000 కోట్లను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇక రూ. 3,043 కోట్లతో సాయి లైఫ్ సైన్సెస్(Sai Life Sciences) రెండో స్థానంలో ఉంది. వీటి సబ్ స్క్రిప్షన్(Subscription) డిసెంబర్ 11న ప్రారంభమై 13న ముగియనుంది. అలాగే ఫిన్ టెక్ సంస్థ మొబిక్విక్(Mobiquik) కూడా ఐపీఓ ద్వారా రూ. 572 కోట్లను సమీకరించనుంది. వీటితో పాటు ఇన్వెంటరస్ నాలెడ్జ్ సొల్యూషన్, ఇంటర్నేషనల్ జెమోలాజికల్ ఇన్స్టిట్యూట్, ధనలక్ష్మి క్రాప్ సైన్స్, జంగిల్ క్యాంప్స్, టాస్ ది కాయిన్, పర్పుల్ యూనిల్ సేల్స్, సుప్రీమ్ పెసిలిటీ, యాష్ హైవోల్టేజ్ డిసెంబర్ రెండో వారంలో ఐపీఓకు రానున్నాయి. అలాగే మరో మూడు కంపెనీలు స్టాక్ ఎక్స్చేంజిలో లిస్ట్ కానున్నాయి.






