- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Iphone 17: రూ.7,000 వరకు పెరగనున్న ఐఫోన్ 17
ఈ రెండింటిపైనా రూ. 7,000 వరకు పెంచాలని యాపిల్ ఆలోచిస్తున్నట్టు టిప్‌స్టర్ యోగేష్ బ్రార్ అన్నారు

దిశ, బిజినెస్ బ్యూరో: టెక్ దిగ్గజం యాపిల్ ఈ ఏడాది విడుదల చేసిన తన ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ ఐఫోన్ 17 ధరలను పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. అధిక డిమాండ్, సరఫరా సమస్యల నేపథ్యంలో దేశీయంగా ఐఫోన్ 17 ధరను సవరించాలని కంపెనీ భావిస్తున్నది. ఐఫోన్ 16తో పోలిస్తే సెప్టెంబర్‌లో విడుదల ఐఫోన్ 17 ధర రూ. 3,000 ఎక్కువ ధరకు విడుదలైంది. అయితే, ఇటీవల పరిణామాల దృష్ట్యా ఇది ఇంకాస్త పెరుగుతుందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా డిమాండ్ స్థాయిలో ఐఫోన్ 17 యూనిట్లు స్టాక్‌లో లేకపోవడం, ప్రస్తుత సేల్ సమయంలో చాలామంది ఈ ఫోన్ కొనాలనుకోవడంతో ధరల పెంపు అనివార్యంగా మారింది. ఐఫోన్ 16 ప్రస్తుతం 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 82,900 నుంచి లభిస్తుంది. 512జీబీ వేరియంట్ రూ. 1,02,900గా ఉంది. ఈ రెండింటిపైనా రూ. 7,000 వరకు పెంచాలని యాపిల్ ఆలోచిస్తున్నట్టు టిప్‌స్టర్ యోగేష్ బ్రార్ అన్నారు. ఇదే జరిగితే సవరణ తర్వాత ఐఫోన్ 17 256జీబీ ధర రూ. 89,900కి, 512జీబీ ధర రూ. 1,09,900కి చేరుకుంటుంది. పలు నివేదికల ప్రకారం, కస్టమర్లపై పెరిగిన ఖర్చుల భారాన్ని తగ్గించేందుకు యాపిల్ కంపెనీ బ్యాంకు డిస్కౌంట్లు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.
కాంపోనెంట్ కొరత
పెరుగుతున్న కాంపోనెంట్ ఖర్చులు కూడా ధరల పెరుగుదలను ప్రభావితం చేస్తాయా అనేది ఇంకా స్పష్టంగా తెలియదు. స్మార్ట్‌ఫోన్‌లు, పీసీలలో ఉపయోగించే డీర్యామ్‌తో సహా మెమరీ చిప్‌లు ప్రపంచవ్యాప్తంగా కొరతను ఎదుర్కొంటున్నాయి. ఈ కొరత మెమరీ ధరలు 20–50 శాతం పెరిగేందుకు కారణమయ్యాయి. శాంసంగ్ కూడా తన చిప్ రేట్లను 60 శాతం వరకు పెంచినట్టు పేర్కొంది. ఈ అధిక కాంపోనెంట్ ఖర్చులు ఇప్పటికే స్మార్ట్‌ఫోన్ పరిశ్రమ అంతటా ధరలను ప్రభావితం చేశాయి. మనదేశంలో ఇటీవల ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ విడుదలలో ఈ ధోరణిని కనిపిస్తున్నది. వన్‌ప్లస్ 13 రూ. 69,999తో పోలిస్తే వన్‌ప్లస్ 15 రూ. 72,999తో లాంచ్ అయింది. తాజా ఐకూ మోడల్‌కు కూడా వ్యత్యాసం ఎక్కువగా ఉంది. ఐకూ 13 దాని బేస్ వేరియంట్ ధర 54,999తో మార్కెట్లోకి రాగా, ఐకూ 15 రూ. 72,999 ధరతో విడుదలైంది.






