Apple iPhone 14ధర ఇండియాలో ఎంతో తెలుసా?

by Dishafeatures2 |
Apple iPhone 14ధర ఇండియాలో ఎంతో తెలుసా?
X

దిశ, వెబ్‌డెస్క్: మొబైల్ ఫోన్ బ్రాండ్స్‌లో ఐఫోన్ టాప్‌లో ఉంటుంది. చాలా మందికి ఐఫోన్ డ్రీమ్ మొబైల్‌గా కూడా ఉంటుంది. ఎప్పటికప్పుడు సరికొత్త మోడల్స్ ఐఫోన్ తన వినియోగదారులను ఆకట్టుకుంటుంది. ప్రతి ఏడాది కొత్త మోడల్‌ను సంస్థ లాంచ్ చేస్తుంటుంది. ఈ క్రమంలోనే 2022లో ఐఫోన్ 14ను సంస్థ తాజాగా లాంచ్ చేసింది. ఇందులో ఐఫోన్ 14 నాలుగు డిఫరెంట్ మోడల్స్‌లో వస్తుందని తెలిపారు. ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్, ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్‌గా సంస్థ తెలిపింది. ఈ నాలుగు మోడల్స్ ధరలు ఇండియాలో ఎంత ఉంటాయన్న విషయంలో భారత యూజర్లు కాస్త అయోమయంలో ఉన్నారు.

అయితే 6.1 అంగుళాల స్క్రీన్‌తో వచ్చే ఐఫోన్ రూ.79,900 నుంచి మొదలై రూ.1,09,900 వరకు ఉంటుంది. అదే విధంగా 6.7 అంగుళాల స్క్రీన్‌ ఐఫోన్ 14 ప్లస్ రూ.89,900 నుంచి రూ.1,19,900, 6.1 అంగుళాల స్క్రీన్ ఐఫోన్ 14 ప్రో రూ.1,29,900 నుంచి రూ.1,79,900 వరకు ధర ఉంటుంది. ఇక చివరిగా 6.7 అంగుళాల స్క్రీన్‌తో వచ్చే ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ రూ.1,39,900 నుంచి రూ.1,89,900 వరకు ధరల ఉంటుంది.

Also Read : ఐఫోన్‌పై మీమ్స్ షేర్ చేసిన Steve Jobs' daughter Eve

Next Story

Most Viewed