- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Gold Bonds: బంగారం పంట పండింది..రూ. లక్షకు 3లక్షలు.. పసిడి ఇన్వెస్టర్లకు కాసుల వర్షం
Gold Bonds: బంగారంపై పెట్టుబడి పెట్టేందుకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి.

దిశ, వెబ్ డెస్క్: Gold Bonds: బంగారంపై పెట్టుబడి పెట్టేందుకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడంటే కొత్త విడుతలు జారీ చేయడం లేదు. కానీ గోల్డ్ బాండ్ స్కీమ్ కు ఒకప్పుడు మంచి డిమాండ్ ఉంటుండేది. దీంతో గతంలో దీంట్లో పెట్టుబడి పెట్టినవారికి మంచి లాభాలను అందించాయి. ఇప్పుడు 2017-18 సిరీస్ ఇన్వెస్టర్లకు 200 శాతానికిపైగా రాబడి వచ్చిందని చెప్పవచ్చు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
బంగారానికి భారతీయులకు మధ్య విడదీయరాని సంబంధం ఉంటుంది. పండగలు, ఫంక్షలు, పెళ్లిళ్లే కాదు..తమకు నచ్చినప్పుడు కూడా బంగారాన్ని కొనుగోలు చేస్తుంటారు. ఈ సెంటిమెంట్ తరతరాలుగా వస్తోంది. అయితేకాలం మారుతున్నా కొద్దీ బంగారం పెట్టుబడికి కొత్త మార్గాలెన్నో అందుబాటులోకి వచ్చాయి. వాటిలో ముఖ్యమైంది సార్వభౌమ బంగారం బాండ్లు ( సావరీన్ గోల్డ్ బాండ్స్) రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ బాండ్లను క్రమానుగతంగా జారీ చేస్తోంది. వీటిని కొనుగోలు చేసినవారు ఇప్పుడు నిజంగా పండగ చేసుకుంటున్నారని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో బంగారం భారంగా మారింది. అందుకే గోల్డ్ బాండ్ స్కీమ్ కింద ఇష్యూలు జారీ చేయడం లేదు.
తాజాగా ఆర్బిఐ 2017-18 సిరీస్ బంగారు బాండ్ల ఫైనల్ రిడెంప్షన్ ధరను వెల్లడించింది. ఈ బాండ్లను 2017 మేల నెలలో జారీ చేశారు. అప్పుడు ఒక గ్రాము బంగారం బాండ్ ధర రూ. 2951గా ఉండగా...మే 9,2025న ఫైనల్ ధర యూనిట్ కు రూ. 9486 ఖరారు చేసింది. అంటే ఈ బాండ్లలో పెట్టుబడి పెట్టినవారికి 8ఏళ్లలో ఏకంగా 221 శాతం రాబడి లభించింది. ఇది నిజంగా అద్బుతమనే చెప్పవచ్చు.
8ఏళ్ల క్రితం ఈ బాండ్లలో రూ. లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టినట్లయితే ఇప్పుడు సుమారు 33.88 గ్రాముల బంగారు బాండ్లు వచ్చేవి . ఇప్పుడు ఆ పెట్టుబడి విలువ రూ. 3,21,496కు చేరుకుంది. అంటే మీ లాభం రూ. 2,21,496. ఇది కేవలం బంగారం ధర పెరగడం వల్ల వచ్చిన లాభమే. అదనంగా మీరు ఈ 8 ఏళ్లలో ప్రతి ఏడాది పెట్టుబడిపై 2.5శాతం చొప్పున వడ్డీని కూడా పొందేవారు. అంటే మీ మొత్తం రాబడి మరింత ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చు.
గోల్డ్ బాండ్స్ అంటే భారత ప్రభుత్వం తరపున ఆర్బిఐ జారీ చేసే ఒక రకమైన ప్రభుత్వ సెక్యూరిటీలు. ఇవి భౌతికంగా బంగారానికి ప్రత్యామ్నాయంగా పనిచేస్తాయి. ఈ బాండ్లను గ్రాముల రూపంలో కొనుగోలు చేస్తారు. వీటి ముఖ్య ప్రయోజనాల విషయానికి వస్తే భౌతిక బంగారాన్ని నిల్వ చేసే ఇబ్బంది ఉండదు. స్వచ్చత గురించి ఆందోళన చెందాల్సిన అవసరం కూడా ఉండదు. పెట్టుబడిపై నిర్ణీత కాలానికి వడ్డీ వస్తుంది. మెచ్యూరిటీపై వచ్చే లాభాలపై ఎలాంటి ఆదాయపు పన్నును విధించరు. అవసరమైతే ఐదేళ్ల తర్వాత ముందస్తుగా విత్ డ్రా చేసుకోవచ్చు. ఒక ఆర్థిక సంవత్సరంలో ఒక వ్యక్తి గరిష్టంగా 4 కిలోల విలువైన బాండ్లలో ఇన్వెస్ట్ చేయవచ్చు. కనీసం ఒక గ్రాము బంగారంపై ఇన్వెస్ట్ చేయాలి.






