Infosys: ఐటీ ఇండస్ట్రీలో సంచలనం.. ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడిపై అట్రాసిటీ కేసు నమోదు

by Kema Shiva Kumar |

ఇన్ఫోసిస్ (Infosys) సహ వ్యవస్థాపకుడు సేనాపతి క్రిస్ గోపాలకృష్ణన్ (Chris Gopalakrishnan), ఐఐఎస్‌సీ మాజీ డైరెక్టర్ బలరామ్‌ (Balaram)తో పాటు మరో 16 మందిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం (Prevention of SC and ST Atrocities Act) కింద కేసు నమోదైంది.

Infosys: ఐటీ ఇండస్ట్రీలో సంచలనం.. ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడిపై అట్రాసిటీ కేసు నమోదు
X

దిశ, వెబ్‌డెస్క్: ఇన్ఫోసిస్ (Infosys) సహ వ్యవస్థాపకుడు సేనాపతి క్రిస్ గోపాలకృష్ణన్ (Chris Gopalakrishnan), ఐఐఎస్‌సీ మాజీ డైరెక్టర్ బలరామ్‌ (Balaram)తో పాటు మరో 16 మందిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం (Prevention of SC and ST Atrocities Act) కింద కేసు నమోదైంది. 71వ సిటీ సివిల్ అండ్ సెషన్ కోర్టు (71 CITY CIVIL AND SESSION COURT) (సీసీహెచ్) ఆదేశాల మేరకు సదాశివ నగర్ (Sadasiva Nagar) పోలీస్ స్టేషన్‌లో పోలీసులు కేసు నమోదు చేశారు. గిరిజన బోవి కమ్యూనిటీకి చెందిన ఫిర్యాదుదారుడు దుర్గప్ప (Durappa) ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (Indian Institute of Science)లోని సెంటర్ ఫర్ సస్టెయినబుల్ టెక్నాలజీ (Center for Sustainable Technology)లో ఫ్యాకల్టీ మెంబర్‌గా కొనసాగుతున్నాడు.

2014లో తనను హనీ ట్రాప్ (Honey Trap) కేసులో తప్పుగా ఇరికించారని, అనంతరం తనను సర్వీసు నుంచి కూడా తొలగించారని అతడు ఆరోపించాడు. అదేవిధంగా తన కులాన్ని దూషిస్తూనే బెదిరింపులకు పాల్పడ్డారని తెలిపాడు. దుర్గప్ప ‘(Durgappa) ఇచ్చిన ఫిర్యాదు మేరకు స్పందించిన పోలీసులు మొత్తం 16 మందిపై ఎస్సీ, ఎస్టీ కేసు (SC, ST Case) నమోదు చేశారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇతర వ్యక్తులలో గోవిందన్ రంగరాజన్, శ్రీధర్ వారియర్, సంద్యా విశ్వేశ్వర్, హరి కేవీఎస్, దాసప్ప, బలరామ్ పి, హేమలతా మిషి, ఛటోపాధ్యాయ. ప్రదీప్ డీ సావార్కర్, మనోహరన్ ఉన్నారు. తనపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు అవడం పట్ల IISc ఫ్యాకల్టీ, బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సభ్యుడి కొనసాగుతోన్న క్రిస్ గోపాలకృష్ణన్ ఇంత వరకు స్పందించకపోవడం గమనార్హం.

Next Story