- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Nirmala Sitharaman: పెట్టుబడులకు, సామర్థ్యాల విస్తరణకు పరిశ్రమలు వెనుకాడొద్దు: నిర్మలా సీతారామన్
యువతను తక్షణ, ప్రత్యక్ష ఉపాధికి తగినట్టుగా సిద్ధం చేయడంలో ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని కోరారు.

దిశ, బిజినెస్ బ్యూరో: దేశంలో పెట్టుబడులకు, సామర్థ్యాల విస్తరణకు పరిశ్రమలు సంకోచించకూడదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అభిప్రాయపడ్డారు. పన్నులు, వ్యాపారాన్ని సులభతరం చేయడం, ఎఫ్‌డీఐ వంటి కీలక సంస్కరణలు తీసుకొచ్చిన నేపథ్యంలో పరిశ్రమలకు సందేహాలు ఉండకూడదని సూచించారు. గురువారం ఇండియన్ ఫౌండేషన్ ఫర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. యువతను తక్షణ, ప్రత్యక్ష ఉపాధికి తగినట్టుగా సిద్ధం చేయడంలో ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని కోరారు. ప్రభుత్వం అన్నీ అందిస్తొంది. దానికనుగుణంగా పరిశ్రమలు కూడా ఫలితాలను ఇవ్వాలి. ప్రస్తుతం భౌగోళిక రాజకీయ పరిణామాలు, వాణిజ్య సవాళ్లు ఎదురవుతున్న సంగతి తెలిసిందే. దాన్ని నేను అర్థం చేసుకోగలను. అయితే, దేశంలో ఉత్పత్తిని పెంచడానికి ఇంకా ఎక్కువ పెట్టుబడులు అవసరం. యువత ఉపాధికి సిద్ధంగా ఉన్నారని, వారి నైపుణ్యాన్ని పెంచేందుకు ప్రభుత్వంతో భాగస్వామ్యం కావాలని, బడ్జెట్‌కు ముందు కాకుండా ఏడాది పొడవునా ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని సూచించారు. దేశవ్యాప్తంగా నిర్వహణ, సేవల నాణ్యతను మెరుగుపరచడానికి విద్యావేత్తలు, విద్యార్థులు, వ్యాపారవేత్తలు కలిసి పనిచేయవలసిన అవసరం ఉందని ఆర్థిక మంత్రి స్పష్టం చేశారు. యువతలో ఇప్పుడున్న నైపుణ్యాలను అప్‌గ్రేడ్ చేయడానికి వీలుగా నాణ్యత కలిగిన ట్రైనర్లను సిద్ధం చేయాలని ప్రభుత్వం ఆశిస్తోందని ఆర్థిక మంత్రి పేర్కొన్నారు.






